తీగనై మల్లెలు పూచినా వేళ...
తీగనై మల్లెలు పూచినా వేళ
ఆగనా అల్లనా పూజకో మాల
మనసు తెర తీసినా మోమాటమేనా
మమత కలబోసినా మాట కరువేనా
తీగనై మల్లెలు పూచినా వేళ
ఆగనా అల్లనా పూజకో మాల
~
తెలిసీ తెలియందా ఇది తెలియక జరిగిందా
ఎపుడో జరిగిందా అది ఇపుడే తెలిసిందా
ఆశపడ్డా అందుతుందా అర్హతైనా ఉందా
అందుకున్నా పొందికుందా పొత్తు కుదిరేదా
ప్రేమకన్నా పాశముందా పెంచుకుంటే దోషముందా
తెంచుకుంటే తీరుతుందా పంచుకుంటే మరిచేదా
~
కలలో మెదిలిందా ఇది కథలో చదివిందా
మెరుపై మెరిసిందా అది వలపై కురిసిందా
రాసి ఉంటే తప్పుతుందా తప్పు నీదవునా
మారమంటే మారుతుందామాసిపోతుందా
చేసుకున్నా పుణ్యముందా చేరుకునే దారి ఉందా
చేదుకునే చేయి ఉందాచేయి చేయి కలిపేనా
~
తీగనై మల్లెలు పూచినా వేళ
ఆగనా అల్లనా పూజకో మాల
మనసు తెర తీసినా మోమాటమేనా
మమత కలబోసినా మాట కరువేనా
తీగనై మల్లెలు పూచినా వేళ
ఆగనా అల్లనా పూజకో మాల
~*~
చిత్రం : ఆరాధన (1987)
గాత్రం : యస్.పి.బాలు, యస్.జానకి
సంగీతం : ఇళయరాజా
రచన : వేటూరి
3 comments:
మంచి సాహిత్యపు గుళికలను ఒక చోట చేరుస్తున్నారు.అలాగే మా సిరివెన్నెల వారి పాటలను కూడా మీ బ్లాగులో చేర్చండి.
తప్పకుండా రాధికగారు. సిరివెన్నెల గారి పాటలంటే నాకూ ప్రత్యేకమైన అభిమానం వుంది. వీలు చూసుకుని తప్పక పోస్ట్ చెస్తాను.
Thank U very much for your compliments and suggestions.
Anni songs bavunnayi radha ..chala thanks ilanti songs anni oke chota post chesinanduku ...great job
---YRK
Post a Comment