Sunday, March 4, 2007

వేణు గానలోలా వేగిరమున రారా!

వేణు గానలోలా వేగిరమున రారా! నిలిచేను ఈ రాధ నీ కోసమే...
వెన్న దొంగ రారా! ఆలసించేవేరా! పలికేను నోరారా నీ నామమే...
పొన్న చెట్టు నీడలోన కన్నె రాధ వేచివుంది...
కన్నె రాధ గుండెలోన చిన్ని ఆశ దాగివుంది
చిన్ని ఆశ దాగివుంది...

*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఒహొ ఊ అహ ఆ

వినిపించని రాగాలే కనిపించని అందాలే

అలలై మదినే తలచే కలలో ఎవరో పిలిచే

వినిపించని రాగాలే......

తొలి చూపులు నాలోనే వెలిగించి దీపాలే

తొలి చూపులు నాలోనే వెలిగించి దీపాలే

చిగురించిన కోరికలే చిలికించెను తాపాలే

వలచి మనసే మనసే

వినిపించని రాగాలే......

వలపే వసంతములా పులకించి పూసినది

వలపే వసంతములా పులకించి పూసినది

చెలరేగిన తెమ్మరలే గిలిగింతలు రేపినవి

విరిసే వయసే వయసే

వినిపించని రాగాలే......

వికసించెను నా వయసే మురిపించు ఈ సోగసే

విరితేనెల వెన్నెలలో కోరతేదో కనిపించే

ఎదలో ఎవరో మెరిసే

వినిపించని రాగాలే కనిపించని అందాలే

అలలై మదినే తలచే కలలో ఎవరో పిలిచే

వినిపించని రాగాలే......

powered by ODEO


చిత్రం : చదువుకున్న అమ్మాయిలు (1963)

గాత్రం : పి.సుశీల

సంగీతం : యస్.రాజేశ్వర రావ్

రచన : దాశరధి

2 comments:

Anonymous said...

meeku na joharlu...
u are doing a great job.Keep it up

Anonymous said...

radha ...ee song vinnappu naku kaligina anandam cheppalenu ...ma amma ee song chala baga padatharu kooda .

Thanks once again
---YRK