Tuesday, March 6, 2007

యమునా తటిలో నల్లనయ్యకై...

యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా
ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెనూ కాదా

యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా
ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెనూ కాదా

రేయి గడిచెనూ పగలు గడిచెనూ మాధవుండు రాలేదే
రాసలీలలా రాజు రానిదే రాగబంధమే లేదే

రేయి గడిచెనూ పగలు గడిచెనూ మాధవుండు రాలేదే
రాసలీలలా రాజు రానిదే రాగబంధమే లేదే

యదుకుమారుడే లేని వేళలో
వెతలు రగిలెనే రాధ గుండెలో
యదుకుమారుడే లేని వేళలో
వెతలు రగిలెనే రాధ గుండెలో
పాపం రాధా యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే
రాధా ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెనూ కాదా

powered by ODEO
~*~
చిత్రం : దళపతి(1992)
గాత్రం : స్వర్ణలత
సంగీతం : ఇళయరాజా

5 comments:

రాధిక said...

ఈ పాటలు,ప్రతీ పాటకి పెట్టిన చిత్రాలతో మీ బ్లాగు బృందావనం లానే వుందండి.

హృదయ బృందావని said...
This comment has been removed by the author.
హృదయ బృందావని said...

Thank you రాధిక గారు. నా బ్లాగ్ లో మొట్టమొదటి కామెంట్ మీదే. మీరిచ్చిన కాంప్లిమెంట్ కన్నా "స్నేహమా" బ్లాగ్ గురించి
తెలుసుకోడం చాలా సంతోషాన్ని కలిగించింది నాకు.
హృదయానికి హత్తుకునేలా వున్నాయి కవితలన్నీ కూడా.
మీ సైట్ లో మరిన్ని మంచి కవితల్ని ఆశిస్తున్నాను.
Thank You once again.

సత్యసాయి కొవ్వలి Satyasai said...

రాధకు నీవేర ప్రాణం చూసినప్పుడు ఈ పాటే గుర్తొచ్చింది. ఈవేళ్అ ఇక్కడ కనిపించింది. బొమ్మలు ఎక్కడివి- మీరేసినవా? గుడిలో ఒకదీపం పాట ఏ సినిమాలోదో తెలియదు. నాకు గుర్తున్నవరకూ..
గుడిలో ఒకదీపం నామదిలో ప్రతిరూపం
ఆరూపం నీదే నీదేలే..

నీపూజకు పూవులు తేవాలని ఎన్నెన్నో తోటలు వెతికాను
వెతికి వెతికి నేనలిసాను నీ నవ్వులలో అవి చూసాను

దేవుడికోసం వెళ్ళాను ఆలయమంతా వెతికాను
వెతికి వెతికి నేనలిసాను ఆదేవును ఎదురుగ చూసాను

హృదయ బృందావని said...

@సత్యసాయి గారు!
పాట చాలా బాగుందండి :). నేనెప్పుడూ విన్నట్టు గుర్తులేదు.
మొత్తం పాట ఎక్కడైనా దొరికితే బాగుణ్ణు.

by the way బొమ్మలు నేను వేసినవి కాదండి, గూగుల్ ఇమేజెస్ నుండి కల్లెక్ట్ చేసాను.