Showing posts with label చిత్ర. Show all posts
Showing posts with label చిత్ర. Show all posts

Thursday, March 15, 2007

దోబుచులాటేలరా గోపాలా....


దోబుచులాటేలరా..
దోబుచులాటేలరా గోపాలా
దోబుచులాటేలరా గోపాలా నా మనసంత నీవేనురా...
దోబుచులాటేలరా గోపాలా నా మనసంత నీవేనురా
~
ఆ యేటి గట్టునేనడిగా
చిరు గాలి నాపి నే నడిగా
ఆ యేటి గట్టునేనడిగా
చిరు గాలి నాపి నే నడిగా
ఆకాశాన్నడిగా బదులే లేదు
ఆకాశాన్నడిగా బదులే లేదు
చివరికి నిన్నే చూశా
హృదయపు గుడిలో చూశా
చివరికి నిన్నే చూశా
హృదయపు గుడిలో చూశా
~
దోబుచులాటేలరా గోపాలా నా మనసంత నీవేనురా....
~
నా మది నీకొక ఆటాడు బొమ్మయ...
నా మది నీకొక ఆటాడు బొమ్మయ
నాకిక ఆశలు వేరేవి లేవయ
యెద లోలో దాగదయా..
నీ అధరాలు అందించ రా గోపాలా..
నీ అధరాలు అందించ రా గోపాలా
నీ కౌగిలిలో కరిగించ రా
నీ తనువే ఇక నా వెల్లువా
పాలకడలి నాది నా గానం
నీ వన్నె మారలేదేమి
పాలకడలి నాది నా గానం
నీ వన్నె మారలేదేమి
నా యెదలో చేరీ వన్నె మార్చుకో
ఊపిరి నీవై నే సాగ
పెదవుల మెరుపు నువు కాగ చేరగ రా.....
~
దోబుచులాటేలరా గోపాలా నా మనసంత నీవేనురా....
~
గగనమే వర్షించ గిరి నెత్తి కాచావు..
గగనమే వర్షించ గిరి నెత్తి కాచావు
నయనాలు వర్షించ నన్నెట్ట బ్రోచేవు
పోవునకనే నీ మతమా
నేనొక్క స్త్రీ నే కదా... గోపాలా
అది తిలకించ కనులే లేవా
నీ కలనే నేనే కాదా
ఉలికె నా మనసు
అరె మూగ కాదు నా వయసు
నా ఊపిరిలోన ఊపిరి నీవై
ప్రాణం పోనికుండ యెపుడు నీవే అండ కాపాడ రా....
~
దోబుచులాటేలరా గోపాలా నా మనసంత నీవేనురా....


powered by ODEO

~*~
చిత్రం : ప్రియురాలు పిలిచింది (2000)
గాత్రం : చిత్ర
సంగీతం : A.R.రెహ్మాన్
రచన : A.M.రత్నం

Tuesday, March 13, 2007

ఏ శ్వాస లో చేరితే...

వేణుమాధవా ఆ ..ఆ...
వేణు మాధవా.....ఆ ..ఆ..

ఏ శ్వాస లో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో
ఏ శ్వాస లో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో
ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో
ఆ శ్వాసలో నే లీనమై ఆ మోవిపై నే మౌనమై
నిను చేరని మాధవా.. ఆ.. ఆ..

ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో

మునులకు తెలియని జపములు జరిపినదా .... మురళీ సఖి
వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా
తనువున నిలువున తొలిచిన గాయమునే
తన జన్మకి తరగని వరముల సిరులని తలచినదా

కృష్ణా నిన్ను చేరింది అష్టాక్షరిగా మారింది
ఎలా ఇంత పెన్నిది వెదురు తాను పొందింది
వేణు మాధవా నీ సన్నిధి

ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో
ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో

చల్లని నీ చిరునవ్వులు కనబడక కనుపాపకి
నలు వైపుల నడి రాతిరి ఎదురవదా
అల్లన నీ అడుగులుసడి వినబడక హృదయానికి
అలజడితో అణువణువు తడబడదా
ఆ.. ఆ..ఆ ..ఆ...ఆ..

నువ్వే నడుపు పాదమిది
నువ్వే మీటు నాదమిది
నివాళిగా నా మది
నివేదించు నిముషమిది
వేణు మాధవా నీ సన్నిధి

గ గ రి గ రి స రి గ గ రి రి స రి
గ ప ద సా స ద ప గ రి స రి
గ ప ద ప ద గ ప ద స ద ద ప గ రి గా
గ ప ద స స గ ప ద స స
ద ప ద రి రి ద ప ద రి రి
ద స రి గ రి స రి
గ రి స రి గ రి గ రి స రి గా
రి స ద ప గ గ గ పా పా
ద ప ద ద ద గ స ద స స
గ ప ద స రి స రి స రి స ద స రి
గ ద స ప గ రి ప ద ప ద స రి
స రి గ ప ద రి
స గ ప ద ప స గ స
ప ద ప స గ స
ప ద ప రి స రి ప ద ప రి స రి
ప ద స రి గ రి స గ ప ద స స గ స రి స గ
స రి గ ప ద రి గా

రాధికా హృదయ రాగాంజలి
నీ పాదముల వ్రాలు కుసుమాంజలి
ఈ గీతాంజలి

~*~

ఈ బ్లాగ్ లో రాసిన ప్రతి పాట నా మనసుకెంతో నచ్చినవే,కానీ ప్రత్యేకించి ఈ "వేణు మాధవా.." పాటంటే నాకు ప్రాణం. మై ఆల్ టైం ఫావొరాట్ సాంగ్ ఇది. ఈ పాట రాసిన సిరివెన్నెల గారిని ప్రశంసించడానికి నా భాషా పరిఙ్ఞానం సరిపోవడం లేదు.
~*~
ఈ పాటను ఇక్కడ వినండి.
~*~
చిత్రం : నేనున్నాను (2004)
గాత్రం : చిత్ర
సంగీతం : కీరవాణి
రచన : సిరివెన్నెల