Thursday, March 15, 2007

దోబుచులాటేలరా గోపాలా....


దోబుచులాటేలరా..
దోబుచులాటేలరా గోపాలా
దోబుచులాటేలరా గోపాలా నా మనసంత నీవేనురా...
దోబుచులాటేలరా గోపాలా నా మనసంత నీవేనురా
~
ఆ యేటి గట్టునేనడిగా
చిరు గాలి నాపి నే నడిగా
ఆ యేటి గట్టునేనడిగా
చిరు గాలి నాపి నే నడిగా
ఆకాశాన్నడిగా బదులే లేదు
ఆకాశాన్నడిగా బదులే లేదు
చివరికి నిన్నే చూశా
హృదయపు గుడిలో చూశా
చివరికి నిన్నే చూశా
హృదయపు గుడిలో చూశా
~
దోబుచులాటేలరా గోపాలా నా మనసంత నీవేనురా....
~
నా మది నీకొక ఆటాడు బొమ్మయ...
నా మది నీకొక ఆటాడు బొమ్మయ
నాకిక ఆశలు వేరేవి లేవయ
యెద లోలో దాగదయా..
నీ అధరాలు అందించ రా గోపాలా..
నీ అధరాలు అందించ రా గోపాలా
నీ కౌగిలిలో కరిగించ రా
నీ తనువే ఇక నా వెల్లువా
పాలకడలి నాది నా గానం
నీ వన్నె మారలేదేమి
పాలకడలి నాది నా గానం
నీ వన్నె మారలేదేమి
నా యెదలో చేరీ వన్నె మార్చుకో
ఊపిరి నీవై నే సాగ
పెదవుల మెరుపు నువు కాగ చేరగ రా.....
~
దోబుచులాటేలరా గోపాలా నా మనసంత నీవేనురా....
~
గగనమే వర్షించ గిరి నెత్తి కాచావు..
గగనమే వర్షించ గిరి నెత్తి కాచావు
నయనాలు వర్షించ నన్నెట్ట బ్రోచేవు
పోవునకనే నీ మతమా
నేనొక్క స్త్రీ నే కదా... గోపాలా
అది తిలకించ కనులే లేవా
నీ కలనే నేనే కాదా
ఉలికె నా మనసు
అరె మూగ కాదు నా వయసు
నా ఊపిరిలోన ఊపిరి నీవై
ప్రాణం పోనికుండ యెపుడు నీవే అండ కాపాడ రా....
~
దోబుచులాటేలరా గోపాలా నా మనసంత నీవేనురా....


powered by ODEO

~*~
చిత్రం : ప్రియురాలు పిలిచింది (2000)
గాత్రం : చిత్ర
సంగీతం : A.R.రెహ్మాన్
రచన : A.M.రత్నం

2 comments:

Sriram said...

ఇంతమంచి పాటల మధ్యలో ఈ పాట ఎందుకు వచ్చిందా అని అనుమానం వచ్చి విన్నాను. అద్భుతమైన ట్యూన్...ఈ ట్యూన్‌కి ఏ వేటూరి గారో సిరివెన్నెల గారో రాసుంటే ఎంత బాగుండేది!

హృదయ బృందావని said...

మీరన్న మాట నిజమే శ్రీరాం గారు. కానీ ఏ.ఎం.రత్నం గారు కూడా ఆ ట్యూన్ కి అందించిన లిరిక్స్ నాకు ఎంతగానో నచ్చాయి. ముఖ్యంగా చిత్ర గారి గాత్రం ట్యూన్ కి మరింత వన్నె తెచ్చింది.

Thanks for stopping by Sriram garu.