Saturday, January 19, 2008

రాధా......! కృష్ణా.......!


రాధా......! కృష్ణా.......!
నీ వలపే బృందావనం
నీ పిలుపే మురళీ రవం
నీలి గగనాలలో తేలి ఆడాలిలే
నీ వలపే బృందావనం
నీ పిలుపే మురళీ రవం
నీలి కెరటాలలో తేలి ఊగాలిలే

కొంటె కృష్ణుని కులుకు చూపులో
కళ్యాణ కాంతులు మెరిసాయిలే
కొంటె కృష్ణుని కులుకు చూపులో
కళ్యాణ కాంతులు మెరిశాయిలే
నా రాధ నడతలో ఈ వేళా..
నవ వధువు తడబాటు కలిగించెలే
కన్నయ్య వచ్చాడు పందిరిలో
రతనాల తలంబ్రాలు కురిసేనులే
రతనాల తలంబ్రాలు కురిసేనులే

రాధా......! కృష్ణా.......!

రాధా కృష్ణుల అనురాగాలు
మనలో రాగాలు నిలపాలిలే
రాధా కృష్ణుల అనురాగాలు
మనలో రాగాలు నిలపాలిలే
నీవు నేనూ జీవితమంతా
నవరాగ గీతాలు పాడాలిలే
మన హృదయాలు పూల నావలో
మధుర తీరాలు చేరాలిలే
మధుర తీరాలు చేరాలిలే

రాధా......! కృష్ణా.......!
నీ వలపే బృందావనం
నీ పిలుపే మురళీ రవం
నీలి కెరటాలలో తేలి ఊగాలిలే

రాధా......! కృష్ణా.......!
రాధా......! కృష్ణా.......!
~*~

~*~
చిత్రం : రాధాకృష్ణ (1978)
సంగీతం: యస్.రాజేశ్వర రావ్

Friday, January 4, 2008

మనసే కోవెలగా మమతలు మల్లెలుగా...



మనసే కోవెలగా మమతలు మల్లెలుగా
నిన్నే కొలిచెదరా..నన్నెన్నడు మరువకురా
కృష్ణా....!
మనసే కోవెలగా మమతలు మల్లెలుగా
నిన్నే కొలిచెదరా..నన్నెన్నడు మరువకురా
కృష్ణా....!
మనసే కోవెలగా మమతలు మల్లెలుగా

ఈ అనురాగం ఈ అనుబంధం మన ఇరువురి ఆనందం
ఈ అనురాగం ఈ అనుబంధం మన ఇరువురి ఆనందం
కలకాలం మధి నిండాలి కలలన్నీ పండాలి
కలకాలం మధి నిండాలి కలలన్నీ పండాలి
మన కలలన్నీ పండాలి

మనసే కోవెలగా మమతలు మల్లెలుగా

ఎన్నో జన్మల పుణ్యముగా నిన్నే తోడుగ పొందాను
ఎన్నో జన్మల పుణ్యముగా నిన్నే తోడుగ పొందాను
ప్రతి రేయీ పున్నమిగా బ్రతుకు తీయగా గడిపేము
ప్రతి రేయీ పున్నమిగా బ్రతుకు తీయగా గడిపేము

మనసే కోవెలగా మమతలు మల్లెలుగా

నీ చూపులలో చూపులతో నీ ఆశలలో ఆశలతో
నీ చూపులలో చూపులతో నీ ఆశలలో ఆశలతో
ఒకే ప్రాణమై ఒకే ధ్యానమై ఒకరికి ఒకరై బ్రతకాలి
ఒకే ప్రాణమై ఒకే ధ్యానమై ఒకరికి ఒకరై బ్రతకాలి

మనసే కోవెలగా మమతలు మల్లెలుగా
నిన్నే కొలిచెదరా..నన్నెన్నడు మరువకురా
కృష్ణా....!
మనసే కోవెలగా మమతలు మల్లెలుగా
~*~
ఈ పాటను ఇక్కడ వినండి.
~*~
చిత్రం : మాతృదేవత(1969)
సంగీతం: ఘంటసాల
రచన : దాశరధి

Sunday, December 16, 2007

మధువనిలో రాధికవో..



మధువనిలో రాధికవో..మధువొలికే గీతికవో
మధురం ఈ జీవనం .. మధురం ఈ జవ్వనం
మనోహరం .. మనోహరం !

మధువనిలో రాధికనూ..మది పలికే గీతికనూ
మధురం ఈ జీవనం .. మధురం ఈ జవ్వనం
మనోహరం .. మనోహరం !

మధువనిలో రాధికవో..మధువొలికే గీతికవో

కార్తీకాన కళలే చిలికి వెలిగే జాబిలీ..
ఎదలో మల్లెల పొదలో వెలిగెను నేడీ జాబిలీ..
నీలాకాశ వీధుల్లోన వెలిగే సూర్యుడూ..
వెతలే మాసిన కధలో వెలిగెను నేడీ సూర్యుడూ..

తొలి తొలీ వలపులే..
తొలకరీ మెరుపులై..
విరిసే వేళలో..హేలలో..డోలలో..

మధువనిలో రాధికనూ..మది పలికే గీతికనూ
మధురం ఈ జీవనం .. మధురం ఈ జవ్వనం
మనోహరం .. మనోహరం !

మధువనిలో రాధికనూ..మది పలికే గీతికనూ..

బృందావనికి మురళీధరుడు ఒకడే కృష్ణుడూ..
ఎదిగిన బాలిక ఎద గల గోపికకతడే దేవుడూ..
మధురాపురికి యమునా నదికి ఒకటే రాధికా..
మరువైపోయిన మనసున వెలసెను నేడీ దేవతా..

వెలుగులా వీణలే..పలికెనూ జాణలో..
అదియే రాగమో..భావమో..బంధమో..

మధువనిలో రాధికవో..మధువొలికే గీతికవో
మధురం ఈ జీవనం .. మధురం ఈ జవ్వనం
మనోహరం .. మనోహరం !
~*~

ఈ పాటను ఇక్కడ వినండి.
~*~
చిత్రం : అల్లరిబావ
సంగీతం: రాజన్-నాగేంద్ర
గాత్రం : యస్.పి.బాలు, పి.సుశీల
రచన : వేటూరి

Friday, November 16, 2007

పిల్లనగ్రోవి పిలుపు...



పిల్లనగ్రోవి పిలుపు మెలమెల్లన రేపెను వలపు
మమతను దాచిన మనసు ఒక మాధవునికే తెలుసు
ఈ మాధవునికే తెలుసు!

సుందరి అందెల పిలుపు
నా డెందము నందొక మెరుపు
నంద కిశోరుని మనసు రతనాల బొమ్మకు తెలుసు!
ఈ రతనాల బొమ్మకు తెలుసు!

వెన్న మీగడలు తిన్నావట
వెన్నెలలో ఆడుకున్నావటా
వెన్న మీగడలు తిన్నావట
వెన్నెలలో ఆడుకున్నావటా
ఎన్నో నేర్చిన వన్నె కాడవట
ఏమందువో మరి నా మాట
ఏమందువో మరి నా మాట!

వెన్న మీగడలు తిన్నది నిజము
ఎన్నో నేర్చితినన్నదీ నిజము
వెన్న మీగడలు తిన్నది నిజము
ఎన్నో నేర్చితినన్నదీ నిజము
చిన్నారీ......చిన్నారీ!
నీ కన్నుల బాసలు వెన్నుని దోచిన
ఆ మాట నిజము..వెన్నుని దోచిన మాట నిజము!

సుందరి అందెల పిలుపు
నా డెందము నందొక మెరుపు
పిల్లనగ్రోవి పిలుపు మెలమెల్లన రేపెను వలపు!

అందీ అందని అందగాడవని
ఎందరో అనగా విన్నాను
అందీ అందని అందగాడవని
ఎందరో అనగా విన్నాను
అందులోని పరమార్ధమేమిటో
అలవోకగా కనుగొన్నాను..అలవోకగా కనుగొన్నాను!

ఎంత బేలవని అనుకున్నాను
అంత గడసరి తరుణివిలే
ఎంత బేలవని అనుకున్నాను
అంత గడసరి తరుణివిలే
అష్ట భార్యలతో అలరే రాజును
చెంగును ముడిచిన చెలువవులే
చెలువవులే చెంగలువవులే !

పిల్లనగ్రోవి పిలుపు మెలమెల్లన రేపెను వలపు
మమతను దాచిన మనసు ఒక మాధవునికే తెలుసు
ఈ మాధవునికే తెలుసు!
~*~

~*~
చిత్రం : శ్రీకృష్ణ విజయం(1971)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
రచన : సి.నారాయణ రెడ్డి

Monday, November 12, 2007

చందమామ రావే జాబిల్లి రావే...



చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే
చందమామ రావే జాబిల్లి రావే

చలువ చందనములుపూయ చందమామ రావే
జాజిపూల తావినియ్య జాబిల్లి రావే
చలువ చందనములుపూయ చందమామ రావే
జాజిపూల తావినియ్య జాబిల్లి రావే
కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే
కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే
గగనపు విరితోటలోని గోగుపూలు తేవే
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే
చందమామ రావే జాబిల్లి రావే

మునిజన మానస మోహిని యోగిని బృందావనం
మురళీరవళికి ఆడిన నాగిని బృందావనం
మునిజన మానసమోహిని యోగిని బృందావనం
మురళీరవళికి ఆడిన నాగిని బృందావనం
రాధామాధవ గాథల రంజిలు బృందావనం
గోపాలుని మృదుపద మంజీరము బృందావనం
గోపాలుని మృదుపద మంజీరము బృందావనం

బృందావనం బృందావనం

హే కృష్ణా ముకుందా మురారీ
హే కృష్ణా ముకుందామురారీ కృష్ణా ముకుందా మురారీ
కృష్ణా ముకుందా మురారీ
జయ కృష్ణా ముకుందా మురారీ
జయ జయ కృష్ణా ముకుందా మురారీ

చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే
చందమామ రావే జాబిల్లి రావే
~*~
~*~

చిత్రం : సిరివెన్నెల
సంగీతం: కె.వి.మహదేవన్
గాత్రం : యస్.పి.బాలు, పి.సుశీల, బి.వసంత
రచన : సీతారామ శాస్త్రి(సిరివెన్నెల)

Thursday, November 8, 2007

దీపావళి శుభాకాంక్షలు !




అనురాగ సరళి

ఆనంద రవళి

ప్రతి ఇంటా జరగాలి

ప్రభవించే దీపావళి!

వంశీ కృష్ణా! యదు వంశీ కృష్ణా!

*
వంశీ కృష్ణా! యదు వంశీ కృష్ణా!
వంశీ కృష్ణా! యదు వంశీ కృష్ణా!
గోప వనిత! హృదయ సరసి! రాజ హంసా!
కృష్ణా..కృష్ణా!
గోప వనిత! హృదయ సరసి! రాజ హంసా!
కృష్ణా..కృష్ణా!
వంశీ కృష్ణా! యదు వంశీ కృష్ణా!

పుట్టింది రాజకుమారుడుగా
పెరిగింది గోపకిశోరుడుగా
తిరిగింది యమునా తీరమున
నిలిచింది గీతాసారంలో
గోప వనిత! హృదయ సరసి! రాజ హంసా!
కృష్ణా..కృష్ణా!
వంశీ కృష్ణా! యదు వంశీ కృష్ణా!

ప్రాణులందరూ వేణువులే
అవి పలికేది నీ రాగములే
పాడేది పాడించేది ఆడేది ఆడించేది
ఓడేది ఓడించేది
అంతా నువ్వేలే అన్నీ నీ లీలలే
గోప వనిత! హృదయ సరసి! రాజ హంసా!
కృష్ణా..కృష్ణా!
వంశీ కృష్ణా! యదు వంశీ కృష్ణా!

నోటిలో ధరణి చూపిన కృష్ణా!
గోటితో గిరిని మోసిన కృష్ణా!
ఆటగా రణము నడిపిన కృష్ణా!
ఆటగా రణము నడిపిన కృష్ణా!
ఆటగా బ్రతుకు గడిపిన కృష్ణా!
ఆటగా బ్రతుకు గడిపిన కృష్ణా!
కిల కిల మువ్వల కేళీ కృష్ణా!
తకదిమి తకదిమి తాండవ కృష్ణా!
కేళీ కృష్ణా! తాండవ కృష్ణా!
కేళీ కృష్ణా! తాండవ కృష్ణా!
కేళీ కృష్ణా! తాండవ కృష్ణా!

~*~
ఈ పాటను ఇక్కడ వినండి.
~*~
చిత్రం : వంశ వృక్షం(1980)
సంగీతం: కె.వి.మహదేవన్
రచన : సి.నారాయణ రెడ్డి

Tuesday, October 30, 2007

కృష్ణా .. నీ పేరు తలచినా చాలు..



కృష్ణా ………!

నీ పేరు తలచినా చాలు … నీ పేరు తలచినా చాలు
మదిలో పొంగు శతకోటి యమునా తరంగాలు
నీ పేరు తలచినా చాలు
మదిలో పొంగు శతకోటి యమునా తరంగాలు
నీ పేరు తలచినా చాలు

ఏమి మురళి అది ఏమి రవళిరా …
ఏమి మురళి అది ఏమి రవళిరా
పాట వినగ ప్రాణాలు కదలురా
ఏమి మురళి అది ఏమీ రవళిరా
పాట వినగ ప్రాణాలు కదలురా
మురళీధరా నీ స్వరలహరులలో మరణమైనా మధురమురా

నీ పేరు తలచినా చాలు

వెదురు పొదలలో తిరిగి తిరిగి
నీ పదపల్లవములు కందిపోయెనా
వెదురు పొదలలో తిరిగీ తిరిగి
నీ పదపల్లవములు కందిపోయెనా
ఎదపానుపుపై పవళించరా
నా పొదిగిన కౌగిట పులకించరా

నీ పేరు తలచినా చాలు
మదిలో పొంగు శతకోటి యమునా తరంగాలు
నీ పేరు తలచినా చాలు

గోపాలా..!నందబాలా! నవమంజుల మురళీలోలా!
మృదు సమీర సంచిత మనోజ్ఞ కుంతల నమాల పల్లవ జాలా

కృష్ణా ..!నీ పేరు తలచినా చాలు

ఏమి పిలుపు అది ఏమి పిలుపు
బృందానికుంజముల పూలు పూచి
శరబిందుచంద్రికల చేయిచాచి
తరుణాంతరంగమున దాగిదాగి
చెలి అందెలందు చెలరేగి రేగి
నను తొందరించెరా………తొలకరించెరా
తొందరించెరా తొలకరించెరా
వలపు జల్లుగా పలుకరించెరా
చల్లని రమణి చల్లని ఉల్లము
అల్లన ఝల్లన పరవశించెరా…

కృష్ణా …. నీ పేరు తలచినా చాలు…



~*~
చిత్రం : ఏకవీర
సంగీతం: కె.వి.మహదేవన్
గాత్రం : పి.సుశీల, యస్.పి.బాలు
రచన : డా.సి.నారాయణ రెడ్డి

Sunday, September 2, 2007

శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు

వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళీ
నవరస మురళీ..ఆనందన మురళీ
ఇదేనా ఇదేనా ఆ మురళి..మొహనమురళీ
ఇదేనా ఆ మురళీ
~
వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళీ
నవరస మురళీ..ఆనందన మురళీ
ఇదేనా ఇదేనా ఆ మురళి..మొహనమురళీ
ఇదేనా ఆ మురళీ
~
కాళింది మడుగునా కాళియుని పడగలా
ఆబాల గోపాల మాబాల గోపాలుని
కాళింది మడుగునా కాళియుని పడగలా
ఆబాల గోపాల మాబాల గోపాలుని
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ
తాండవమాడిన సరళి గుండెల మ్రోగిన మురళి
ఇదేనా..ఇదేనా ఆ మురళీ
~
అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరలా వినిపించీ మరులే కురిపించి
అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరలా వినిపించీ మరులే కురిపించి
జీవన రాగమై బృందావన గీతమై
ఆ.. జీవన రాగమై బృందావన గీతమై
కన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి
ఇదేనా.. ఇదేనా ఆ మురళీ
~
వేణుగానలోలుని మురిపించిన రవళి..
నటనల సరళి ఆ నందనమురళీ
ఇదేనా ఆ మురలి మువ్వల మురళీ
ఇదేనా ఆ మురళీ
~
మధురానగరిలో యమునా లహరిలో
ఆ రాధ ఆరాధనా గీతి పలికించి
మధురానగరిలో యమునా లహరిలో
ఆ రాధ ఆరాధనా గీతి పలికించి
సంగీత నాట్యాల సంగమ సుఖ వేణువై
ఆ..ఆ..ఆసంగీత నాట్యాల సంగమ సుఖ వేణువై
రాసలీలకే ఊపిరిపోసిన అందెల రవళి
ఇదేనా..ఇదేనా ఆ మురళీ
~
వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళీ
నవరస మురళీ..ఆనందన మురళీ
ఇదేనా ఇదేనా ఆ మురళి..మొహనమురళీ
ఇదేనా ఆ మురళీ
చిత్రం : సప్తపది (1981)
సంగీతం: కె.వి.మహదేవన్
రచన : వేటూరి
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~


హే కృష్ణా....! హే కృష్ణ....! కృష్ణా...!
హే కృష్ణా...మళ్ళీ నీవే జన్మిస్తేనీ భగవద్గీతే నిజమయితే
హే కృష్ణా...మళ్ళీ నీవే జన్మిస్తేనీ భగవద్గీతే నిజమయితే
ప్రతి సుమవనము బృందావనము

ప్రతి సుమవనము బృందావనము

ప్రతి మూగ మోవీ మోహన మురళీ

కృష్ణా..!మళ్ళీ నీవే జన్మిస్తే

నీ భగవద్గీతే నిజమయితే

నీవు నేనూ వేరు కాదు

ఇద్దరి ఊరు వేరు కాదు

నీవు నేనూ వేరు కాదు

ఇద్దరి ఊరు వేరు కాదు

ఆడేది పాడేది నేను కాదు

నా ఆటలో పాటలో నీ దయ లేకపోలేదు

ఆడేది పాడేది నేను కాదు

నా ఆటలో పాటలో నీ దయ లేకపోలేదు

అందరి చూపు నా పైన

మరి నా చూపేమో నీ పైన

హే కృష్ణా...మళ్ళీ నీవే జన్మిస్తే

నీ భగవద్గీతే నిజమయితే

గోవులు కాస్తూ నీవుంటావు

నీజీవిక సాగిస్తు వుంటావు

గోవులు కాస్తూ నీవుంటావు

నీ జీవిక సాగిస్తు వుంటావు

పలికించు నీ వేణు గీతానికి

ఫలితము ఎన్నడు కోరుకోవులే నీవు

పలికించు నీ వేణు గీతానికి

ఫలితము ఎన్నడు కోరుకోవులే నీవు

నీ కథలోన నేనున్నాను

నీ కథలోన నేనున్నాను

నా కథలోన నీవున్నావు

కృష్ణా..!మళ్ళీ నీవే జన్మిస్తే

నీ భగవద్గీతే నిజమయితే


~*~
ఈ పాటను ఇక్కడ వినండి.
~*~
చిత్రం : మొరటోడు (1977)
సంగీతం: యం.యస్.విశ్వనాథన్

Wednesday, August 29, 2007

మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే...


మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే
మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే
కలనైన కనని ఆనందం ఇల లోన విరిసె ఈనాడే
~
మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే
సిగ్గు చాటున నా లేత వలపు మొగ్గ తొడిగిందీ
సిగ్గు చాటున నా లేత వలపు మొగ్గ తొడిగిందీ
పాల వెన్నెల స్నానాలు చేసి పూలు పూసింది
~
మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే
కెరటాల వెలుగు చెంగలువా నెలరాజు పొందు కోరేను
కెరటాల వెలుగు చెంగలువా నెలరాజు పొందు కోరేను
అందాల తారలై మెరిసి చెలి కాని చెంత చేరేను
~
మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే
~
రాధ లోని అనురాగమంత మాధవునిదేలే
వేణు లోలుని రాగాల కోసం వేచి ఉన్నదిలే
~
మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే
మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే
కలనైన కనని ఆనందం, ఇల లోన విరిసె ఈనాడే
మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే
~*~

~*~
చిత్రం : ఆత్మీయులు (1969)
గాత్రం : పి.సుశీల
సంగీతం : యస్.పి.కోదండపాణి
రచన : ఆరుద్ర