Tuesday, March 6, 2007

మెల్ల మెల్ల మెల్లగా....


మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా
మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా
మెత్తగ అడిగితే లేదనేది లేదుగా
మెత్తగ అడిగితే లేదనేది లేదుగా
మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా
~
నీది కానిదేది లేదు నాలో నిజానికే నేనున్నది నీలో
నీది కానిదేది లేదు నాలో నిజానికే నేనున్నది నీలో
ఒక్కటే మనసున్నది ఇద్దరిలో
ఒక్కటే మనసున్నది ఇద్దరిలో
ఆ ఒక్కటీ చిక్కెనీ గుప్పిటిలో
హా...
~
మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా
మెత్తగ అడిగితే లేదనేది లేదుగా
మెత్తగ అడిగితే లేదనేది లేదుగా
మెల్ల మెల్ల మెల్లగా
~
నిన్ను చూచి నన్ను నేను మరచినాను
నన్ను దోచుకొమ్మనీ నిలిచినాను
నిన్ను చూచి నన్ను నేను మరచినాను
నన్ను దోచుకొమ్మనీ నిలిచినాను
దోచుకుందమనే నేను చూచినాను
దోచుకుందమనే నేను చూచినాను
చూచి చూచి నువ్వె నన్ను దోచినావు
~
మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా
మెత్తగ అడిగితే లేదనేది లేదుగా
మెత్తగ అడిగితే లేదనేది లేదుగా
మెల్ల మెల్ల మెల్లగా
~
కన్నులకు కట్టినావు ప్రేమ గంతలు
కన్నె మనసు ఆడినదీ దాగుడు మూతలు
కన్నులకు కట్టినావు ప్రేమ గంతలు
కన్నె మనసు ఆడినదీ దాగుడు మూతలు
దొరికినాము చివరకు తోడు దొంగలం
దొరికినాము చివరకు తోడు దొంగలం
దొరలమై ఏలుదాము వలపు సీమను
హా...
~
మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా
మెత్తగ అడిగితే లేదనేది లేదుగా
మెత్తగ అడిగితే లేదనేది లేదుగా
మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా
మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా
~*~
చిత్రం : దాగుడు మూతలు(1964)
గాత్రం : ఘంటసాల, పి.సుశీల
సంగీతం : కె.వి.మహదేవన్
రచన : ఆత్రేయ

2 comments:

రానారె said...

అణువణువూ నీ"దె"గా... (కదా!?)

హృదయ బృందావని said...

థాంక్యూ వెరీమచ్ రనారె గారు. మీరు చెప్పేదాకా సరిగ్గా గమనించలేదు నేను. ఇప్పుడు కరెక్ట్ చేశాను. ఆ ఒక్క అక్షరమే కాకుండా ఇంకా కొన్ని తప్పులు కూడా వున్నాయి అని ఇప్పుడే గమనించాను, అవి కూడా సరిదిద్దాను. థాంక్యూ వన్స్ అగైన్.

and thanks for stopping by too.