Wednesday, March 7, 2007

తొలిసంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో..

తొలిసంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో
తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం
యెగిరొచ్చే కెరటం సింధూరం

తొలిసంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో
తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం
యెగిరొచ్చే కెరటం సింధూరం

జీవితమే రంగుల వలయం దానికి ఆరంభం సూర్యుని ఉదయం
గడిచే ప్రతి నిమిషం ఎదిగే ప్రతిబింబం
వెదికే ప్రతి ఉదయం దొరికే ఒక హృదయం
ఆ హృదయం సంధ్యా రాగం మేలుకొలిపే అనురాగం

తొలిసంధ్య వేళలో........

సాగరమే పొంగుల నిలయం దానికి ఆలయం సంధ్యా సమయం
వచ్చే ప్రతి కెరటం చేరదు అది తీరం
లేచే ప్రతి కెరటం అది అంటదు ఆకాశం
ఆ ఆకాశంలో ఒక మేఘం మేలుకొలిపే అనురాగం

తొలిసంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో
తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం
యెగిరొచ్చే కెరటం సింధూరం
~*~
ఈ పాటను ఇక్కడ వినండి.
~*~

చిత్రం : సీతారాములు(1980)
గాత్రం : పి. సుశీల
సంగీతం : సత్యం
రచన : సి.నారాయణ రెడ్డి

3 comments:

రాధిక said...

మీ బ్లాగుకు చక్కని పాటల కోసం కాకపోయినా అందమయిన చిత్రాలు చూడడానికయినా రోజూ రావాలండి.

Anonymous said...

ఇది నాకెంతో ఇష్టమయిన పాట...ముఖ్యంగా "సాగరమే పొంగుల నిలయం దానికి ఆలయం సంధ్యా సమయం
వచ్చే ప్రతి కెరటం చేరదు అది తీరం
లేచే ప్రతి కెరటం అది అంటదు ఆకాశం
ఆ ఆకాశంలో ఒక మేఘం మేలుకొలిపే అనురాగం"

ఈ పదాలకు సత్యం గారి సంగీతం అద్భుతంగా ఉంటుంది.

హృదయ బృందావని said...

థాంక్యూ రాధిక గారు. ఫోటోస్ సేకరించడం నా హాబీ.

థాంక్యూ సుధాకర్ గారు. మీరన్నట్టు ఈ పాటకు సత్యం గారు అందించిన సంగీతం సుమధురం. ఇక సినారె గారి సాహిత్యం అక్షర సత్యంగా వుంటుందన్నది అందరికి తెలిసిన విషయమే.

by the way మీ శోధన చూసాను. చాలా informative గా వుంది. Good One.