Friday, March 9, 2007

నువ్వు వస్తావని బృందావని...

నువ్వు వస్తావని బృందావని
ఆశగ చూసేనయ్యా కృష్ణయ్యా..

నువ్వు వస్తావని బృందావని
ఆశగ చూసేనయ్యా కృష్ణయ్యా

వేణువు విందామని నీతో వుందామని
నీ రాధా వేచేనయ్యా
రావయ్యా...ఓ.........ఓ...........
గిరిధర మురహర రాధా మనోహరా...

నువ్వు వస్తావని బృందావని
ఆశగ చూసేనయ్యా
కృష్ణయ్యా..రావయ్యా..

నీవు వచ్చే చోటనీవు నడిచే బాట
మమతల దీపాలు వెలిగించానూ
మమతల దీపాలు వెలిగించానూ
కుశలము అడగాలని పదములు కడగాలని
కన్నీటి కెరటాలు తరలించానూ
ఓ....ఓ......ఓ.ఓ.ఓ....

గిరిధర మురహర నా హృదయేశ్వరా..
నీ రాధ గుండెలలో తాపము చల్లార్చరా
నీ రాధ గుండెలలో తాపము చల్లార్చరా
కృష్ణయ్యా..ఓ..కృష్ణయ్యా....కృష్ణయ్యా..ఓ..కృష్ణయ్యా....

నీ పద రేణువునైనా పెదవుల వేణువునైనా
బ్రతుకే ధన్యమని భావించానూ..
బ్రతుకే ధన్యమని భావించానూనిన్నే చేరాలని
నీలో కరగాలని నా మనసే హారతిగా వెలిగించానూ..

గోవింద గోవింద గోవింద గోవింద గోవిందా...
గోపాలా.......

powered by ODEO

~*~
చితం : మల్లెపువ్వు (1970's)
గాత్రం : వాణీజయరాం
సంగీతం : చక్రవర్తి
రచన : ఆరుద్ర



Thursday, March 8, 2007

నేనొక ప్రేమ పిపాసిని.....

ఆహా...ఆ...హహహహహా......
ఆ.....ఆ.....అహా..ఆహా...
నేనొక ప్రేమ పిపాసిని
నీవొక ఆశ్రమ వాసివి
నా దాహం తీరనిది
నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని
నీవొక ఆశ్రమ వాసివి
నా దాహం తీరనిది
నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని

తలుపు మూసిన తలవాకిటనే
పగలు రేయి నిలుచున్నా
పిలిచి పిలిచి బదులేరాక
అలసి తిరిగి వెళుతున్నా
తలుపు మూసిన తలవాకిటనే పగలు రేయి నిలుచున్నా
పిలిచి పిలిచి బదులేరాక అలసి తిరిగి వెళుతున్నా
నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది
~
నేనొక ప్రేమ పిపాసిని
~
పూట పూట నీ పూజ కొసమని పూవులు తెచ్చానూ
ప్రేమ బిక్షను పెట్టగలవని దోసిలి వొగ్గానూ
నీ అడుగులకు మడుగులొత్తగా ఎడదను పరిచానూ
నీవు రాకనే అడుగు పడకనే నలిగి పోయానూ
నేనొక ప్రేమ పిపాసిని
పగటికి రేయి రేయికి పగలు పలికే వీడ్కోలు
సెగరేగిన గుండెకు చేబుతున్న నీ చెవిన పడితే చాలు
నీ జ్ఞాపకాల నీడలలో నన్నేపుడో చూస్తావూ
నను వలచావని తేలిపేలోగ నివురై పోతాను
~
నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి
నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని
~*~
~*~
చిత్రం : ఇంద్రధనుసు(1970's)
గాత్రం : యస్.పి.బాలు
సంగీతం : కె.వి.మహదేవన్
రచన : ఆత్రేయ

పాడవేల రాధికా ప్రణయ సుధా గీతికా..

ఆ..ఆ ..ఆఆ...ఆఆఆ...ఆఆఆ....
ఓఓ.. ఓఓ..ఓఓఓఓ...ఓఓఓఓఓఓ.....
పాడవేల రాధికా ప్రణయ సుధా గీతికా
పాడవేల రాధికా ప్రణయ సుధా గీతికా
పాడవేల రాధికా

ఈ వసంత యామినిలో.....
ఈ వెన్నెల వెలుగులలో....
ఈ వసంత యామినిలో
ఈ వెన్నెల వెలుగులలో
జీవితమే పులకించగ
జీవితమే పులకించగ
ఈ వీణను సవరించి
పాడవేల రాధికా

గోపాలుడు నిను వలచి నీ పాటను మది తలచి
గోపాలుడు నిను వలచి నీ పాటను మది తలచి
ఏ మూలను పొంచి పొంచి
ఏ మూలను పొంచి పొంచి
వినుచున్నాడని ఎంచి
పాడవేల రాధికా

వేణుగానలోలుడనీ వీణామృదు రవము వినీ
ఈ....ఈ...ఈఈ....ఈఈఈ.....
వేణుగానలోలుడనీ వీణామృదు రవము వినీ
ప్రియమారగ నిను చేరగ దయచేసెడి సుభ వేళ

పాడవేల రాధికా ప్రణయ సుధా గీతికా
పాడవేల రాధికా

powered by ODEO
ఈ పాట వినాలంటే పాట యొక్క టైటిల్ ను క్లిక్ చేయండి.

~*~

చిత్రం : ఇద్దరు మిత్రులు(1961)
గాత్రం : పి.సుశీల, ఘంటసాల
సంగీతం : సాలూరి రాజేశ్వరరావ్
రచన : శ్రీశ్రీ

Wednesday, March 7, 2007

తొలిసంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో..

తొలిసంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో
తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం
యెగిరొచ్చే కెరటం సింధూరం

తొలిసంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో
తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం
యెగిరొచ్చే కెరటం సింధూరం

జీవితమే రంగుల వలయం దానికి ఆరంభం సూర్యుని ఉదయం
గడిచే ప్రతి నిమిషం ఎదిగే ప్రతిబింబం
వెదికే ప్రతి ఉదయం దొరికే ఒక హృదయం
ఆ హృదయం సంధ్యా రాగం మేలుకొలిపే అనురాగం

తొలిసంధ్య వేళలో........

సాగరమే పొంగుల నిలయం దానికి ఆలయం సంధ్యా సమయం
వచ్చే ప్రతి కెరటం చేరదు అది తీరం
లేచే ప్రతి కెరటం అది అంటదు ఆకాశం
ఆ ఆకాశంలో ఒక మేఘం మేలుకొలిపే అనురాగం

తొలిసంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో
తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం
యెగిరొచ్చే కెరటం సింధూరం
~*~
ఈ పాటను ఇక్కడ వినండి.
~*~

చిత్రం : సీతారాములు(1980)
గాత్రం : పి. సుశీల
సంగీతం : సత్యం
రచన : సి.నారాయణ రెడ్డి

Tuesday, March 6, 2007

యమునా తటిలో నల్లనయ్యకై...

యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా
ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెనూ కాదా

యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా
ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెనూ కాదా

రేయి గడిచెనూ పగలు గడిచెనూ మాధవుండు రాలేదే
రాసలీలలా రాజు రానిదే రాగబంధమే లేదే

రేయి గడిచెనూ పగలు గడిచెనూ మాధవుండు రాలేదే
రాసలీలలా రాజు రానిదే రాగబంధమే లేదే

యదుకుమారుడే లేని వేళలో
వెతలు రగిలెనే రాధ గుండెలో
యదుకుమారుడే లేని వేళలో
వెతలు రగిలెనే రాధ గుండెలో
పాపం రాధా యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే
రాధా ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెనూ కాదా

powered by ODEO
~*~
చిత్రం : దళపతి(1992)
గాత్రం : స్వర్ణలత
సంగీతం : ఇళయరాజా

మెల్ల మెల్ల మెల్లగా....


మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా
మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా
మెత్తగ అడిగితే లేదనేది లేదుగా
మెత్తగ అడిగితే లేదనేది లేదుగా
మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా
~
నీది కానిదేది లేదు నాలో నిజానికే నేనున్నది నీలో
నీది కానిదేది లేదు నాలో నిజానికే నేనున్నది నీలో
ఒక్కటే మనసున్నది ఇద్దరిలో
ఒక్కటే మనసున్నది ఇద్దరిలో
ఆ ఒక్కటీ చిక్కెనీ గుప్పిటిలో
హా...
~
మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా
మెత్తగ అడిగితే లేదనేది లేదుగా
మెత్తగ అడిగితే లేదనేది లేదుగా
మెల్ల మెల్ల మెల్లగా
~
నిన్ను చూచి నన్ను నేను మరచినాను
నన్ను దోచుకొమ్మనీ నిలిచినాను
నిన్ను చూచి నన్ను నేను మరచినాను
నన్ను దోచుకొమ్మనీ నిలిచినాను
దోచుకుందమనే నేను చూచినాను
దోచుకుందమనే నేను చూచినాను
చూచి చూచి నువ్వె నన్ను దోచినావు
~
మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా
మెత్తగ అడిగితే లేదనేది లేదుగా
మెత్తగ అడిగితే లేదనేది లేదుగా
మెల్ల మెల్ల మెల్లగా
~
కన్నులకు కట్టినావు ప్రేమ గంతలు
కన్నె మనసు ఆడినదీ దాగుడు మూతలు
కన్నులకు కట్టినావు ప్రేమ గంతలు
కన్నె మనసు ఆడినదీ దాగుడు మూతలు
దొరికినాము చివరకు తోడు దొంగలం
దొరికినాము చివరకు తోడు దొంగలం
దొరలమై ఏలుదాము వలపు సీమను
హా...
~
మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా
మెత్తగ అడిగితే లేదనేది లేదుగా
మెత్తగ అడిగితే లేదనేది లేదుగా
మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా
మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా
~*~
చిత్రం : దాగుడు మూతలు(1964)
గాత్రం : ఘంటసాల, పి.సుశీల
సంగీతం : కె.వి.మహదేవన్
రచన : ఆత్రేయ

Monday, March 5, 2007

ఊహలు గుస గుస లాడే.....

ఊహలు గుస గుస లాడే
నా హృదయం ఊగిస లాడే
ప్రియా....ఊహలు గుస గుస లాడే
నా హృదయం ఊగిస లాడే

వలదన్న వినదీ మనసు కలనైన నిన్నే తలచు
వలదన్న వినదీ మనసు కలనైన నిన్నే తలచు
తొలిప్రేమలో బలముందిలే అది నీకు మునుపే తెలుసు
ఊహలు గుస గుస లాడేనా హృదయము ఊగిసలాడే

నను కోరి చేరిన బేల దూరాన నిలిచేవేల
నను కోరి చెరిన బేల దూరాన నిలిచేవేల
నీ ఆనతి లేకున్నచో విడలేను ఊపిరి కూడ
ఊహలు గుస గుస లాడేనా హృదయము ఊగిసలాడే

దివి మల్లెపందిరి వేసే భువి పెళ్ళిపీటలు వేసే
దివి మల్లెపందిరి వేసే భువి పెల్లిపీటలు వేసే
సిరి వెన్నెల కురిపించుచు నెలరాజు పెండ్లిని చేసే
ఊహలు గుస గుసలాడేమన హృదయములూయలలూగే

~*~
ఈ పాటను ఇక్కడ వినండి.
~*~
చిత్రం : బందిపోటు (1963)
గాత్రం : ఘంటసాల, పి.సుశీల
సంగీతం : ఘంటసాల
రచన : ఆరుద్ర

ఛల్ మోహనరంగా...!


నీకూ నీ వారు లేరు
నాకూ నా వారు లేరు
ఏటి వడ్డునా ఇల్లు కడదము
పదరా చల్ మోహనరంగా!
నీకు నాకూ జోడు కలసెను
గదరా ఛల్ మోహనరంగా!

మరుమల్లీ తోటలోన
మంచినీళ్ళ బావి కాడ
వుంగరాలు మరిచి వస్తిని
గదరా ఛల్ మోహనరంగా!

కంటీకి కాటుకెట్టి
కడవా సంకానబెట్టి
కంటినీరు కడవ నింపితి
గదరా ఛల్ మోహనరంగా!

గట్టు దాటి పుట్ట దాటి
ఘనమైన ఊరు దాటి
అన్నీ దాటి అడవి బడితిమి
గదరా ఛల్ మోహనరంగా!

నీకు నాకు జోడు అయితే
మల్లె పూల తెప్ప గట్టి
తెప్ప మీదా తేలి పోదాము
పదరా ఛల్ మోహనరంగా!

అదిరా నీ గుండెలదురా
మధురా వెన్నెల రేయి
నిదరాకూ రమ్మంటిని
కదరా ఛల్ మోహనరంగా!

వ్రేపల్లె వేచేనూ వేణువు వేచెనూ

వ్రేపల్లె వేచేనూ వేణువు వేచెనూ
వ్రేపల్లె వేచేనూ వేణువు వేచెనూ

వనమెల్ల వేచేనురా
నీరాక కోసం నిలువెల్ల కనులై
నీరాక కోసం నిలువెల్ల కనులై
ఈ రాధ వేచేనురా
రావేలా రావేలా

కోకిలమ్మ కూయనన్నదీ నీవు లేవని
గున్న మావి పూయనన్నదీ నీవు రావని
కాటుక కన్నీటి జాలుగా జాలి జాలిగా
కాటుక కన్నీటి జాలుగా జాలి జాలిగా
కదలాడే యమునా నది

నీరాక కోసం నిలువెల్ల కనులై ఈ రాధ వేచేనురా..
రావేలా రావేలా
మా వాడ అంటున్నదీ స్వామి వస్తాడని
నా నీడ తానన్నదీ రాడు రాడేమని
రగిలెను నా గుండె దిగులుగా కోటి సెగలుగా
రగిలెను నా గుండె దిగులుగా కోటి సెగలుగా
రావేల చిరుజల్లుగా

నీరాక కోసం నిలువెల్ల కనులై ఈ రాధ వేచేనురా
రావేలా రావేలా


powered by ODEO
ఈ పాట వినడానికి పైనున్న ప్లేయర్ లేదా పాట టైటిల్ మీద క్లిక్ చేయండి.
~*~

చిత్రం : శారద(1970's)
గాత్రం : పి.సుశీల
సంగీతం : చక్రవర్తి

Sunday, March 4, 2007

నీవు లేక

నీవు లేక వీణా పలుకలేనన్నదీ
నీవు రాక రాధా నిలువలేనన్నది
ఆఆఆ.....ఆఆ....ఆఆ..
నీవు లేక వీణా...

జాజి పూలు నీకై రోజు రోజు పూచె
చూసి చూసి పాపం సొమ్మసిల్లి పోయె
చందమామ నీకై తొంగి తొంగి చూసి
చందమామ నీకై తొంగి తొంగి చూసి
సరసను లేవని అలుకలుబోయె

నీవు లేక వీణా...

కలలనైన నిన్ను కనుల చూతమన్నా
నిదుర రాని నాకు కలలు కూడ రావె
కదలలేని కాలం విరహ గీతి రీతి..
కదలలేని కాలం విరహ గీతి రీతి..
పరువము వృదగా బరువుగ సాగె

నీవు లేక వీణా..

తలుపులన్ని నీకై తెరచి వుంచి నాను
తలపులెన్నొ మదిలో దాచి వేచి నాను
తాపమింక నేను ఓపలెను స్వామి
తాపమింక నేను ఓపలెను స్వామి
తరుణిని కరుణను యేలగ రావా

నీవు లేక వీణా పలుకలేనన్నది
నీవు రాక రాధా నిలువలేనన్నది
నీవు లేక వీణా.....
~*~
ఈ పాటను ఇక్కడ వినండి.
~*~


చిత్రం : డా.చక్రవర్తి (1964)
గాత్రం : పి.సుశీల
సంగీతం : యస్.రాజేశ్వర్ రావ్
రచన : ఆత్రేయ