Thursday, July 26, 2007

మల్లెల వేళ అల్లరి వేళ...


మల్లెల వేళ అల్లరి వేళ
మల్లెల వేళ అల్లరి వేళ
మదిలో మన్మధ లీల
నీవు నేనైన వేళ
వుండిపోవాలి ఇలా ఇలా
~
మల్లెల వేళ అల్లరి వేళ
మదిలో మన్మధ లీల
నీవు నేనైన వేళ
వుండిపోవాలి ఇలా ఇలా
~
ఒక యమున నేడు పొంగింది
ఒక మధుర మురళి మ్రోగింది
యమునా తటిలో మురళీ రవళి
ఒక రాగమేదొ జుమ్మంది
ఒక రాధ మనసు జల్లంది
బృందావనిలో అందాలొలికే
ఆ రాధా మాధవ రాస క్రీడలే
రసడోలలూగించు వేళ
~
మల్లెల వేళ అల్లరి వేళ
మదిలో మన్మధ లీల
~
ఒక నింగి వలచి చేరింది
ఒక నేల ముద్దులాడింది
నింగీ నేల ఉరిసీ మెరిసీ
ఒక మబ్బు ఉబ్బి ఉరిమింది
అది పెళ్ళి మేళమయ్యింది
దివిలో మేళం భువిలో తాళం
ఆ మేళ తాళాల మేళవింపులో
జగమెల్ల దీవించు వేళ
~
మల్లెల వేళ అల్లరి వేళ
మదిలో మన్మంధ లీల
నీవు నేనైన వేళ
వుండిపోవాలి ఇలా ఇలా
~
మల్లెల వేళ అల్లరి వేళ
మదిలో మన్మధ లీల
~*~
చిత్రం : జూదగాడు (1979)
సంగీతం: చక్రవర్తి
రచన : వేటూరి

Thursday, July 19, 2007

నీ రూపమే......


నీ రూపమే........
నా మదిలోన తొలి దీపమే..
మన అనుబంధమెన్నెన్ని జన్మాలదో
ఇది అపురూపమే
~
నీ రూపమే........
నా మదిలోన తొలి దీపమే..
మన అనుబంధమెన్నెన్ని జన్మాలదో
ఇది అపురూపమే
~
నీ రూపమే.......
~
ఆశలు లేని నా గుండెలోన
అమృతము కురిసిందిలే..
వెన్నెల లేని నా జీవితాన
పున్నమి విరిసిందిలే...
నీవూ నేనూ తోడూ నీడై
నీవూ నేనూ తోడూ నీడై
వీడక వుందాములే
వీడక వుందాములే
~
నీ రూపమే........
నా మదిలోన తొలి దీపమే..
మన అనుబంధమెన్నెన్ని జన్మాలదో
ఇది అపురూపమే
~
నీ రూపమే.......
~
లేత లేత హృదయంలో
వలపు దాచి వుంటాను
నా వలపు నీకే సొంతమూ...
నిన్ను చూచి మురిశాను
నన్ను నేను మరిచాను
నీ పొందు ఎంతో అందమూ
ఏ పూర్వ పుణ్యమో..ఏ దేవి దీవెనో
ఏ పూర్వ పుణ్యమో..ఏ దేవి దీవెనో
వేసెను విడరాని బంధమూ
వేసెను విడరాని బంధమూ
~
నీ రూపమే........
నా మదిలోన తొలి దీపమే..
మన అనుబంధమెన్నెన్ని జన్మాలదో
ఇది అపురూపమే
~
నీ రూపమే......
~*~
ఈ పాటను ఇక్కడ వినండి.
~*~
చిత్రం : అన్నదమ్ముల సవాల్ (1978)
సంగీతం: సత్యం

Monday, July 16, 2007

పాడనా వేణువై నీవు నా ప్రాణమై...


పాడనా వేణువై నీవు నా ప్రాణమై
పాడనా వేణువై నీవు నా ప్రాణమై
నా జీవన బృందావని లో
ప్రియ దర్శన రస మాధురిలో
~
పాడనా వేణువై నీవు నా ప్రాణమై
~
చెలీ! సఖీ! ప్రియే! చారుశీలే! అనీ..
తలచి తనువు మరచి కలలు కన్నానులే
కాముడిలా సుమ బాణాలు వేసి
కదిలిన నీ చలి కోణాలు చూసి
ఆమనిలో సుమ గంధాలు పూసి
కవితలుగా నవ వేదాలు రాసి
మోవికి తగిలి ముద్దుల మురళి
కౌగిళ్ళలో ప్రియ కళ్యాణిలో
సంగీతమే పాడిందిలే
~
పాడనా వేణువై నీవు నా ప్రాణమై
~
కలం..గళం..స్వరం నాకు నీవేననీ
మధుర ప్రణయ కవిత పాడుకున్నానులే
నీలో అలిగే అందాల రూపం
నాలో వెలిగే శృంగార దీపం
నీలో కరిగే ఆ ఇంద్ర చాపం
నాలో జరిగే అమృతాభిషేకం
సన్నని కులుకే వెన్నెల చినుకై
రమ్మందిలే మనసిమ్మందిలే
నీ రాగమే పాడిందిలే
~
పాడనా వేణువై నీవు నా ప్రాణమై
నా జీవన బృందావని లో
ప్రియ దర్శన రస మాధురిలో
~
పాడనా వేణువై నీవు నా ప్రాణమై
~*~
ఈ పాటను ఇక్కడ వినండి.
~*~

చిత్రం : సుందరి~సుబ్బారావ్
సంగీతం: సత్యం

Friday, July 6, 2007

ఒక వేణువు వినిపించెను...


ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక..
ఒక రాధిక అందించెను నవరాగ మాలిక..
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక..
~
సిరి వెన్నెల తెలబోయెను జవరాలి చూపులో
సిరి వెన్నెల తెలబోయెను జవరాలి చూపులో
నవ మల్లిక చినవోయెను
నవ మల్లిక చినవోయెను చిరునవ్వు సొగసులో
~
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక
~
వనరాణియె అలివేణికి సిగపూలు తురిమెనూ
వనరాణియె అలివేణికి సిగపూలు తురిమెనూ
రేరాణియె నా రాణికి రేరాణియె నా రాణికి పారాణి పూసెను..
~
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక
~
ఏ నింగికి ప్రభవించెనొ నీలాల తారక
ఏ నింగికి ప్రభవించెనొ నీలాల తారక
నా గుండెలొ వెలిగించెను
నా గుండెలొ వెలిగించెనుసింగార దీపిక...
~
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక..
ఒక రాధిక అందించెను నవరాగ మాలిక..
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక..
~*~
చిత్రం : అమెరికా అమ్మాయి(1976)
సంగీతం: జి.కె.వెంకటేష్

Friday, June 22, 2007

కలగన్నాను..ఏదో కలగన్నాను...


కలగన్నాను..ఏదో కలగన్నాను
నే..కలగన్నాను
కలగన్నాను ఏదో కలగన్నాను
నే..కలగన్నాను
~
బ్రతుకే అనురాగమని వలపే ఆనందమని
కలగన్నాను ఏదో కలగన్నాను
నే..కలగన్నాను
~
మనసులలోని మమకారాలు మారవని
మమతలలోని మాధుర్యాలు మాయవని
మనసులలోని మమకారాలు మారవని
మమతలలోని మాధుర్యాలు మాయవని
కళ కళ లాడుతు ఎపుడూ వలచి నిలచి వుంటాయని
~
బ్రతుకే అనురాగమని వలపే ఆనందమని
కలగన్నాను ఏదో కలగన్నాను
నే..కలగన్నాను
~
చిలకా గోరింకల చెలిమి చెదరదనీ
జాబిలి తారల జతలు ఎన్నడూ వీడవనీ
చిలకా గోరింకల చెలిమి చెదరదనీ
జాబిలి తారల జతలు ఎన్నడూ వీడవనీ
వలచిన హృదయాలెపుడూ కలసి మెలసి వుంటాయని
~
బ్రతుకే అనురాగమని వలపే ఆనందమని
కలగన్నాను ఏదో కలగన్నాను
నే..కలగన్నాను
~
అనుకున్నవి ఆశలుగానే మిగిలిన నాడు
కలలన్నీ కల్లలుగానే కరిగిన నాడు
అనుకున్నవి ఆశలుగానే మిగిలిన నాడు
కలలన్నీ కల్లలుగానే కరిగిన నాడు
నింగి నేల ఎపుడూ కలిసి మెలిసి వుండవనీ
~
కలగన్నాను..ఏదో కలగన్నాను
నే..కలగన్నాను
నే..కలగన్నాను
~*~
ఈ పాటను ఇక్కడ వినండి.
~*~
చిత్రం : బంగారు మనిషి(1976)
సంగీతం: కె.వి.మహదేవన్

Monday, June 18, 2007

పూలై పూచే...


పూలై పూచే...రాలిన తారలే..
అలలై వీచే...ఆరని ఆశలే..
నీలో నిలిచేను ఏనాడు నీ ప్రాణమై
నీలో పలికేను ఏనాడు నీ గీతమై
~
పూలై పూచే...రాలిన తారలే..
అలలై వీచే...ఆరని ఆశలే..
నీలో నిలిచేను ఏనాడు నీ ప్రాణమై
నీలో పలికేను ఏనాడు నీ గీతమై
~
పూలై పూచే...రాలిన తారలే..
అలలై వీచే...ఆరని ఆశలే..
నీలో నిలిచేను ఏనాడు నీ ప్రాణమై
నీలో పలికేను ఏనాడు నీ గీతమై
~
కాంతులు విరిసే నీ కన్నులలోనా
నా కలలుండాలి ఏ జన్మకైనా
మమతలు నిండిన నీ కౌగిలిలోనా
నా మనువు తనువు పండించుకోనా
~
నా వలపే నిండని పండని నీ రూపమై
నా వలపే నిండని పండని నీ రూపమై
~
పూలై పూచే...రాలిన తారలే..
అలలై వీచే...ఆరని ఆశలే..
నీలో నిలిచేను ఏనాడు నీ ప్రాణమై
నీలో పలికేను ఏనాడు నీ గీతమై
~
మెరిసెను నవ్వులు నీ పెదవుల పైనా హా...
అవి వెలిగించాలి యే చీకటినైనా..
వెచ్చగ తాకే నీ ఊపిరిలోనా..
జీవించాలి నా బాసలు ఏనాడైనా
~
నా బ్రతుకే సాగని ఆగని నీ ధ్యానమై
నా బ్రతుకే సాగని ఆగని నీ ధ్యానమై
~
పూలై పూచే...రాలిన తారలే..
అలలై వీచే...ఆరని ఆశలే..
నీలో నిలిచేను ఏనాడు నీ ప్రాణమై
నీలో పలికేను ఏనాడు నీ గీతమై
~*~
ఈ పాటను ఇక్కడ వినండి.
~*~
చిత్రం : నిండు మనిషి(1978)
సంగీతం: సత్యం

మల్లెలు పూసే వెన్నెల కాసే....


మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా
~
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా...
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా
~
ముసి ముసి నవ్వులలో గుస గుస లాడినవే...
నా తొలి మొజులలో నీ విరజాజులై
ముసి ముసి నవ్వులలో గుస గుస లాడినవే...
నా తొలి మోజులలో నీ విరజాజులై
~
మిస మిస వన్నెలలో మిల మిల మన్నవిలె
ఈ బిగి కౌగిలిలో జాబిలి రాత్రులే
కాటుకలంటుకున్న కౌగిలింత లెంత వింతలే
~
మనసులు పాడే మంతనమాడే ఈ పూట జంటగా
~
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా...
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా
~
హాహా....హాహా.......ఆ.......
~
తొలకరి కోరికలే తొందర చేసినవే
ఈ విరి సెయ్యకే ఆవిరి తీరగా
~
తొలకరి కోరికలే తొందర చేసినవే
ఈ విరి సెయ్యకే ఆవిరి తీరగా
సొగసరి కానుకలే సొద పెడుతున్నవిలే
యే తెర చాటునో ఆ చెఱ వీడగా..
అందిన పొందులోనె అందలేని విందులీయవె
~
కలలిక పండే కలయిక నేడే కావాలి వేడిగా
~
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా...
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా
~
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా...
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా
~*~

చిత్రం : ఇంటింటి రామాయణం(1979)
సంగీతం: రాజన్ నాగేంద్ర
రచన : వేటూరి

Tuesday, June 12, 2007

ఇది తీయని వెన్నెల రేయి....


ఇది తీయని వెన్నెల రేయి
మది వెన్నెల కన్నా హాయి
నా ఊహల జాబిలి రేఖలు
కురిపించెను ప్రేమ లేఖలు
~
ఇది తీయని వెన్నెల రేయి
మది వెన్నెల కన్నా హాయి
~
సుజా...!
~
నడి రాతిరి వేళ నీ పిలుపు
గిలిగింతలతో నను ఉసి గొలుపు
నడి రాతిరి వేళ నీ పిలుపు
గిలిగింతలతో నను ఉసి గొలుపు
~
నును చేతులతో నను పెనవేసి
నా ఒడిలో వాలును నీ వలపు
~
ఇది తీయని వెన్నెల రేయి
మది వెన్నెల కన్నా హాయి
~
నీ పెదవులు చిలికే మధురిమలు
అనురాగము పలికే సరిగమలు
మన తనువులు కలిపే రాగాలు
కలకాలం నిలిపే కావ్యాలు
~
ఇది తీయని వెన్నెల రేయి
మది వెన్నెల కన్నా హాయి
~*~
చిత్రం : ప్రేమ లేఖలు
సంగీతం: సత్యం

Thursday, June 7, 2007

చిగురాకులలో ఒక చిలకమ్మ..


చిగురాకులలో ఒక చిలకమ్మ
చిగురాకులలో ఒక చిలకమ్మ
నీ చెంతను వాలింది, గిలిగింతలు కోరింది
ఆశలే తెలుసుకో మనసులో నిలుపుకో
ఆశలే తెలుసుకో మనసులో నిలుపుకో
చిగురాకులలో ఒక చిలకమ్మా....
~
పొద్దుపొడుపు తోటలో ముద్దబంతి పూసింది
మూగ కళ్ళ ఊసులో ముచ్చటంత దాచింది
పొద్దుపొడుపు తోటలో ముద్దబంతి పూసింది
మూగ కళ్ళ ఊసులో ముచ్చటంత దాచింది
రేకు రేకులో నీ పేరే రాసిపెట్టుకున్నది
లేక లేక నీ గుండెల్లో గూడు కట్టుకున్నది
అందుకో అన్నది అందుకే ఉన్నది
అందుకో అన్నది అందుకే ఉన్నది
~
చిగురాకులలో ఒక చిలకమ్మ
చిగురాకులలో ఒక చిలకమ్మ
నీ చెంతను వాలిందిగిలిగింతలు కోరింది
ఆశలే తెలుసుకో మనసులో నిలుపుకో
ఆశలే తెలుసుకో మనసులో నిలుపుకో
చిగురాకులలో ఒక చిలకమ్మా....
~
కలల కలవరింతలో కనులు కతలు చెప్పాలి
మాట రాని వేళలో మనసులొకటి కావాలి
కలల కలవరింతలో కనులు కతలు చెప్పాలి
మాట రాని వేళలో మనసులొకటి కావాలి
తోడు నీడగా నీ ఒడిలో కోటి కలలు పండని
ప్రేమ సీమకు ఈ వేళా మేలుకొలుపు పాడని
ఆశలే పొంగనీ...బాసలే తీరనీ
ఆశలే పొంగనీ...బాసలే తీరనీ
~
చిగురాకులలో ఒక చిలకమ్మ
చిగురాకులలో ఒక చిలకమ్మ
నీ చెంతను వాలింది, గిలిగింతలు కోరింది
ఆశలే తెలుసుకో మనసులో నిలుపుకో
ఆశలే తెలుసుకో మనసులో నిలుపుకో
~*~
చిత్రం : జీవిత రథం (1981)
సంగీతం: చక్రవర్తి

Friday, May 25, 2007

చుక్కల తోటలో ఎక్కడున్నావో...

చుక్కల తోటలో ఎక్కడున్నావో
పక్కకు రావే మరుమల్లె పువ్వా

చక్కని జాబిలి ఎక్కడుంటాను
నీ పక్కనే చుక్కనై పలకరిస్తాను

నీలి నీలి నీ కురుల నీలాల మేఘాల
విరిసింది మల్లిక నా రాగ మాలిక
అల్లిబిల్లి నీ కౌగిట అల్లుకున్న నా మమత

కొసరింది కోరిక అనురాగ గీతిక

నీ మూగ చూపులలో...చెలరేగే పిలుపులలో
నీ పట్టు విడుపులలో...సుడి రేగే వలపులలో
కన్ను కన్ను కలవాలి కలసి వెన్నెలై పోవాలి
చీకటి వెన్నెల నీడలలో దాగుడు మూతలు ఆడాలి

చుక్కల తోటలో ఎక్కడున్నావో

పక్కకు రావే మరుమల్లె పువ్వా
చక్కని జాబిలి ఎక్కడుంటాను
నీ పక్కనే చుక్కనై పలకరిస్తాను

ఆకలైన నాకు తెలుసు కౌగిలెంత తీయనిదో..

కౌగిలింతకే తెలుసు ఆకలెంత తీరనిదో
వేచి వున్న నాకు తెలుసు విరహమెంత తీయనిదో..
కాచుకున్న నీకు తెలుసు కలయికెంత కమ్మనిదో

ఈ పూల వానలలో తడిసిన నీ అందాలు
ఆ.........
ఈ పూట సొగసులలో కురిసిన మకరందాలు
నీలో తీగలు మీటాలి..నాలో రాగం పలకాలి
లోకం మరచిన మైకంలో మనమే ఏకం కావాలి

చుక్కల తోటలో ఎక్కడున్నావో

పక్కకు రావే మరుమల్లె పువ్వా
చక్కని జాబిలి ఎక్కడుంటాను
నీ పక్కనే చుక్కనై పలకరిస్తాను

powered by ODEO

~*~
ఈ పాట వినాలంటే పైనున్న ప్లేయర్ ను గానీ లేదా
పాట యొక్క టైటిల్ ను గాని క్లిక్ చేయండి.
~*~

చిత్రం : అల్లరి బుల్లోడు (1978)
గాత్రం : పి.సుశీల, యస్.పి.బాలు
సంగీతం: చక్రవర్తి
రచన : ??