Tuesday, May 22, 2007

రాధను నేనయితే...నీ రాధను నేనయితే...

రాధను నేనయితే...నీ రాధను నేనయితే..
రాధను నేనయితే..నీ రాధను నేనయితే

నిన్ను మలచుకుంటాను నా మురళిగా
నిన్ను చేసుకుంటాను నా తరుణిగా
నిన్ను మలచుకుంటాను నా మురళిగా

నిన్ను చేసుకుంటాను నా తరుణిగా

తోటనిండా మల్లియలు
తుంటరి పాటల తుమ్మెదలు
తోటనిండా మల్లియలు
తుంటరి పాటల తుమ్మెదలు
అల్లరి తుమ్మెదల అలికిడి వినగానె
అల్లరి తుమ్మెదల అలికిడి వినగానె
మల్లెలు సవరించు పై ఎదలు

గడసరి చినవాడు తోడుగ వుంటే
కరగును నునుసిగ్గు పరదాలు..
గడసరి చినవాడు తోడుగ వుంటే
కరగును నునుసిగ్గు పరదాలు
చిలిపిగ నను నీవు చేరుకుంటే
జల జల పొంగును పరువాలు

రాధవు నీవైతే నా రాధవు నీవైతే

నిన్ను మలచుకుంటాను నా మురళిగా
నిన్ను చేసుకుంటాను నా తరుణిగా

రాధ అంటే ఎవ్వరదీ... మాధవ పాదాల పువ్వు అది
రాధ అంటే ఎవ్వరదీ మాధవ పాదాల పువ్వు అది
అంతటి స్వామి చెంతగ వుంటేనే
అంతటి స్వామి చెంతగ వుంటేనే
ఆమె మనసు పూచేది

తీయగ సోకే పిల్లగాలికి పూయని పువ్వే వుంటుందా
తీయగ సోకే పిల్లగాలికి పూయని పువ్వే వుంటుందా
కన్నుగీటే వన్నెకానికి కరగని జవ్వని వుంటుందా

రాధను నేనయితేనీ రాధను నేనయితే
నిన్ను మలచుకుంటాను నా మురళిగా
నిన్ను చేసుకుంటాను నా తరుణిగా
~*~

ఈ పాటను ఇక్కడ వినండి.
~*~
చిత్రం : ఇన్స్పెక్టర్ భార్య (1970's)
గాత్రం : పి.సుశీల, కె.బి.కె.మోహన్ రాజ్
సంగీతం: కె.వి.మహదేవన్

Friday, May 18, 2007

యమునా తీరాన రాధ మదిలోన..


యమునా తీరాన రాధ మదిలోన
కృష్ణుని ప్రేమ కథా....
కొసరి పాడేటి కోరి వలచేటి
మనసు నీది కదా..
~
హృదయం తెలుపు ఊహలలో..
రాగం నిలుపు ఆశలలో..
తేనెల తేటల తీయని భావన
ఊరెను నా మనసులో..
~
యమునా తీరాన రాధ మదిలోన
కృష్ణుని ప్రేమ కథా....
కొసరి పాడేటి కోరి వలచేటి
మనసు నాది కదా..
~
ఎదలో తలపే వణికెనులే
అధరం మధురం చిలికెనులే
రాధా హృదయం మాధవ నిలయం
మాయని ఈ చరితమే
~
మనసే నేడు వెనుకాడే
హృదయం విరిసి కదలాడే
లోలో భయము తొణికేనే
ఎదలో సుఖము విరిసేనే
పందిరిలో నిను పొందెద ఆ దినం..
ఆ దినమే పండుగ
~
యమునా తీరాన రాధ మదిలోన
కృష్ణుని ప్రేమ కథా....
కొసరి పాడేటి కోరి వలచేటి
మనసు నాది కదా..
లా..లాలలాలలలా..
~*~
చిత్రం : గౌరవం(1970)
సంగీతం: యం.యస్.విశ్వనాథన్

Wednesday, May 16, 2007

చూడుమదే చెలియా..

చూడుమదే చెలియా..కనుల
చూడుమదే చెలియా..కనుల
చూడుమదే చెలియా..

బృందావనిలో నందకిశోరుడు
బృందావనిలో నందకిశోరుడు
అందముగా దీపించే లీలా...
చూడుమదే చెలియా..కనుల
చూడుమదే చెలియా..

మురళీ కృష్ణుని మోహన గీతికి
మురళీ కృష్ణుని మోహన గీతికి
పరవశమైనవి లోకములే..
పరవశమైనవి లోకములే
విరబూసినవీ పొన్నలు పొగడలు
విరబూసినవీ పొన్నలు పొగడలు
పరిమళమెగసెను నలయా నిలముల పోలెను యమునా...

చూడుమదే చెలియా..కనుల
చూడుమదే చెలియా..

నారీ నారీ నడుమ మురారి
నారీ నారీ నడుమ మురారి
హరికీ హరికీ నడుమ వయ్యారీ
హరికీ హరికీ నడుమ వయ్యారీ
తానొకడైనా..........
తానొకడైనా తలకొక రూపై
తానొకడైనా తలకొక రూపై
మనసులు దోచే రాధా మాధవ కేళీ నటనా..

చూడుమదే చెలియా..
కనులచూడుమదే చెలియా..
~*~

powered by ODEO
~*~
చిత్రం : విప్రనారాయణ (1954)
గాత్రం : ఏ.యం.రాజా
సంగీతం: యస్.రాజేశ్వరరావ్
రచన : సముద్రాల

Thursday, May 3, 2007

బృందావన చందమామ...


బృందావన చందమామ ఎందుకోయి తగవు
బృందావన చందమామ ఎందుకోయి తగవు
అందమెల్ల నీదే ఆనందమె కద నాది
బృందావన చందమామ ఎందుకోయి తగవు
~
మంద మందహాసములే వెన్నెలలై విరియ
రచట రంగ రంగములను రాసలీల వెలయ
మంద మందహాసములే వెన్నెలలై విరియ
రచట రంగ రంగములను రాసలీల వెలయ
యదు సుందర నీ రూపము కనువిందుగదోయి
~
బృందావన చందమామ ఎందుకోయి తగవు
~
చిరు గజ్జల గలగలలు కలరవములు చెలగ
మురళీరవ మధురిమలు రాగసుఖము కలుగ
చిరు గజ్జల గలగలలు కలరవములు చెలగ
మురళీరవ మధురిమలు రాగసుఖము కలుగ
మనమోహనమీ గానము మధురమధురమోయి
~
బృందావన చందమామ ఎందుకోయి తగవు
బృందావన చందమామ ఎందుకోయి తగవు
అందమెల్ల నీదే ఆనందమె కద నాది
.

powered by ODEO

~*~
.
చిత్రం : పెళ్ళినాటి ప్రమాణాలు(1958)
గాత్రం : ఘంటసాల, జిక్కి
సంగీతం: ఘంటసాల
రచన : పింగళి నాగేంద్రరావు

Wednesday, May 2, 2007

రావే ముద్దుల రాధా!


రావే ముద్దుల రాధా!
నా ప్రేమ రాధివి నీవెగ
నవ రత్నాల రాశివి నీవెగ
~
పోవయ్యా శ్రీకృష్ణా!
నీ సరసాలన్నీ మాయలే
నువు దూరాన వుంటే మేలులే
~
వనితలెవ్వరు నీసాటి రారే
నిన్నె నిరతము నే కోరినానే
వనితలెవ్వరు నీసాటి రారే
~
నిన్నె నిరతము నే కోరినానే
కోపమేల దయగను బాలా
తాపమింక నే తాళజాల
మనసు నిలకడ కొంతైన లేదా
తరుణి తరుణితొ ఈ ఆటలేనా
~
మనసు నిలకడ కొంతైన లేదా
తరుణి తరుణితొ ఈ ఆటలేనా
చాలు చాలును ఈ మాటలేల
నీటి మూటలు నేనమ్మజాల
~
రావే ముద్దుల రాధా!
నా ప్రేమ రాధివి నీవెగ
నవ రత్నాల రాశివి నీవెగ
~
పోవయ్యా శ్రీకృష్ణా!
నీ సరసాలన్నీ మాయలే
నువు దూరాన వుంటే మేలులే
చిత్రం : పెళ్ళినాటి ప్రమాణాలు(1958)
గాత్రం : ఘంటసాల, పి.సుశీల
సంగీతం: ఘంటసాల
రచన : పింగళి నాగేంద్రరావు

బృందావన మోహనుడు


అడుగో అడుగో అరుదెంచేనూ బృందావన మోహనుడు
అడుగో అడుగో అరుదెంచేనూ బృందావన మోహనుడు
అడుగో అడుగో అరుదెంచేనూ బృందావన మోహనుడు
~
తొందర పడకే రాధికా...
తొందర పడకే రాధికా
నంద కుమారుడు నీవాడే
నంద కుమారుడు నీవాడే
~
అడుగో అడుగో అరుదెంచేనూ బృందావన మోహనుడు
~
తెలిసీ తెలియని వలపులు చిలికే
కలువల చెలువల కన్నులతో
విరిసీ విరియని విరజాజులతో
సరసములాడే నవ్వులతో
~
ఎదురు చూచు రాధా....ఆ...నాకెదురయ్యే రాధా..
ఎదురు చూచు రాధానాకెదురయ్యే రాధా
~
ఎన్నినాళ్ళకు ఈ కనికరము
ఎన్నాళ్ళకు ఈ దరిశనము
ఎన్నో ఏళ్ళుగ తలిపిన తపము
ఈ నాడే ఫలియించినదే
~
తొందర పడకే రాధికా..
తొందర పడకే రాధికా..
నంద కుమారుడు నీవాడే
నంద కుమారుడు నీవాడే
~
మధురాపురమని పేరేగానీ
మాథురులేమీ లేనేలేవే
మధురతరము మా గోకులమే
మధుర మధురము రాధిక ప్రేమా
~
ఎదురు చూచు రాధా....ఆ...నాకెదురయ్యే రాధా..ఆ..ఆ...
ఎదురు చూచు రాధానాకెదురయ్యే రాధా
~*~
చిత్రం : బాల సన్యాసమ్మ కథ(1956)
గాత్రం : ఘంటసాల, వైదేహి, ఎ.పి.కోమల
రచన : యస్.రాజేశ్వరరావ్

Thursday, April 26, 2007

వేణు గానమ్ము వినిపించెనే...


వేణు గానమ్ము వినిపించెనే
చిన్ని కృష్ణ్ణయ్య కనిపించడే
వేణు గానమ్ము వినిపించెనే
చిన్ని కృష్ణ్ణయ్య కనిపించడే
వేణు గానమ్ము వినిపించెనే..
~
దోర వయసున్న కన్నియల హృదయాలను
దోచుకున్నాడని విన్నాను చాడీలను
దోర వయసున్న కన్నియల హృదయాలను
దోచుకున్నాడని విన్నాను చాడీలను
~
అంత మొనగాడటే ఒట్టి కథలేనటే
ఏది కనపడితే నిలవేసి అడగాలి వానినే...
~
వేణు గానమ్ము వినిపించెనే
చిన్ని కృష్ణ్ణయ్య కనిపించడే
వేణు గానమ్ము వినిపించెనే...
~
మన్ను తిన్నావని యశోదమ్మ అడిగిందట
లేదు లేదనుచూ లోకాలను చూపాడట
మన్ను తిన్నావని యశోదమ్మ అడిగిందట
లేదు లేదనుచూ లోకాలను చూపాడట
~
అంత మొనగాడటే వింత కథలేనటే
ఏది కనపడితే కనులారా చూడాలి వానినే...
~
వేణు గానమ్ము వినిపించెనే
చిన్ని కృష్ణ్ణయ్య కనిపించడే
వేణు గానమ్ము వినిపించెనే..
~
దుడుకు కృష్ణ్ణయ్య మడుగులోన దూకాడట
జడిసి రేపల్లె ప్రజలంతా మూగారట
దుడుకు కృష్ణ్ణయ్య మడుగులోన దూకాడట
జడిసి రేపల్లె ప్రజలంతా మూగారట
~
ఘల్లు గల్ గల్లన ఒళ్ళు ఝల్ ఝల్లన
తాను ఫణిరాజు పడగపై తారంగమాడేనట
~
వేణు గానమ్ము వినిపించెనే
చిన్ని కృష్ణ్ణయ్య కనిపించడే
వేణు గానమ్ము వినిపించెనే..
~*~
చిత్రం : సిరి సంపదలు (1963)
గాత్రం : పి.సుశీల, యస్.జానకి, జిక్కి
సంగీతం: మాస్టర్ వేణు
రచన : ఆత్రేయ

యమునా తీరమున సంధ్యా సమయమున...

ఆ..............
యమునా తీరమున సంధ్యా సమయమున
యమునా తీరమున సంధ్యా సమయమున
వేయి కనులతో రాధ వేచి యున్నది కాదా!

"మంజు ఏ ఆపేసావ్...ఏమి లేదు
ఆపకు మంజు నీ కాలి మువ్వల సవ్వడి
నా పాటకు నడక నేర్పాలి
నా గానానికి జీవం పొయ్యాలి"

రావోయి రాసవిహారి
ఆ.........
యమునా తీరమున సంధ్యా సమయమున
యమునా తీరమున సంధ్యా సమయమున
వేయి కనులతో రాధ ఆ.......
వేయి కనులతో రాధ వేచి యున్నది కాదా!
యమునా తీరమునా.....

బాస చేసి రావేల మదన గోపాలా..!
బాస చేసి రావేల మదన గోపాలా..!
నీవు లేని జీవితము తావి లేని పూవు కదా

యమునా తీరమున సంధ్యా సమయమున
యమునా తీరమున సంధ్యా సమయమున
వేయి కనులతో రాధ వేచి యున్నది కాదా!
యమునా తీరమునా.....

పూపొదలో దాగనేల పో పోరా సామి
ఇంతసేపు ఏ ఇంతికి వంత పాడినావో
దాని చెంతకె పోరాదో

రానంత సేపు విరహమా
నేను రాగానే కలహమా
రాగానే కలహమా
నీ మేన సరసాల చిన్నెలు
అవి ఏ కొమ్మ కొనగోటి ఆనవాలూ
ఏ కొమ్మ కొనగోటి ఆనవాలూ
దోబూచులాడితి నీతోనే
ఇవి ఈ కొమ్మ గురుతులు కాబోలు
ఈ కొమ్మ గురుతులు కాబోలు
నేను నమ్మనులే
నేను నమ్మనులే నీ మాటలు
అవి కమ్మని పన్నీటి మూటలు
నా మాట నమ్మవే రాధికా
ఈ మాధవుడు నీ వాడే గా
రాధికా...మాధవా...
రాధికా...మాధవా...
~*~


చిత్రం : జయభేరి (1958)
గాత్రం : ఘంటసాల, పి.సుశీల
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
రచన : ఆరుద్ర

Monday, April 23, 2007

వేణుగాన సమ్మోహనం.....


కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవ మౌక్తికం కరతలే వేణుం
~
వేణుగాన సమ్మోహనం వేలి మీద గోవర్ధనం
రేపల్లె మానందనం వేనోళ్ళ నీ కీర్తనం
ఆషాడ మేఘాలొచ్చి ఆనందాల జల్లే కురిసె
ఆలారే......
~
వేణుగాన సమ్మోహనం వేలి మీద గోవర్ధనం
రేపల్లె మానందనం వేనోళ్ళ నీ కీర్తనం
~
పాల చెక్కి నెతినెత్తి అమ్మబోతె కిట్టయ్య
యేలు పెట్టి ఎంగిలి చేతడు ఎట్టాగమ్మో ఇంకెట్టాగమ్మో
మాటు చూసి మడుగులోన ముణగబోతె కిట్టయ్య
సీరలు గుంజి చక్కా పోతడు ఎట్టాగమ్మో ఇంకెట్టాగమ్మో
యేరే కోక నీరే రైక అంటాడమ్మో
అట్టాగని అంటాముట్టనట్టు ఉందామంటే
మురిపాలు పొంగిస్తే పాలెందుకంటాడు ఓలమ్మో
పాలెందుకంటాడు ఓలమ్మో
హే..సీకట్లు చుట్టేసి చీరెందుకంటాడు ఓలమ్మో
ఓలమ్మో..
బుటుకు బుటుకు బుగ్గ గిల్లిపోయినట్టు
సిటుకు సిటుకు సినుకు ముద్దులిచినట్టు
బుటుకు బుటుకు బుగ్గ గిల్లిపోయినట్టు
సిటుకు సిటుకు సినుకు ముద్దులిచినట్టు
వయసు పట్టి లాగినట్టు మనసు గిచ్చి పోయినట్టు
ఆలారె ఆలారె ఆనందబాల
అందాల కిట్టయ్యకు తందాన హేల
ఆలారె ఆలారె ఆనందబాల
అందాల కిట్టయ్యకు తందాన హేల
ఆలారే........
~
వేణుగాన సమ్మోహనం..వేణుగాన సమ్మోహనం
వేలి మీద గోవర్ధనం..వేలి మీద గోవర్ధనం
రేపల్లె మానందనం..రేపల్లె మానందనం
వేనోళ్ళ నీ కీర్తనం..వేనోళ్ళ నీ కీర్తనం
~
కృష్ణా!....ముకుందా!.....మురారీ!......
~
నంద యశోదా, నందనులకు నవ మదనదేవునకు గొబ్బిళ్ళు
చందన చర్చిత నీలదేహ గగనాల సొగసుకు గొబ్బిళ్ళు
ఉసురు గాలులను వెదురు పాటలుగ
ఆ...........
ఉసురు గాలులను వెదురు పాటలుగ
పలుకు వేణువుకు గొబ్బిళ్ళు..
~
ఏటి మీద ఎన్నెల్లో ఎన్నెలంటి కన్నెల్లో
కన్నెగంటి సన్నల్లో సన్నజాజి గిన్నెల్లో
వేదనంతా వెన్నలాగా కరిగే వేళళ్ళో
వేదనంతా వెన్నలాగా కరిగే వేళళ్ళో
~
ఏ గీత మాకిస్తావో ఎవ్వరి గీత మారుస్తావో ఆరారే...
~
వేణుగాన సమ్మోహనం వేలి మీద గోవర్ధనం
రేపల్లె మానందనం వేనోళ్ళ నీ కీర్తనం
~
ఆలారే మేఘాలొచ్చి ఆనందాలే జల్లై కురిసే
ఆలారే........
~*~
చిత్రం : స్వరాభిషేకం(2004)
గాత్రం : రాధిక, శంకర్ మహదేవన్
సంగీతం : విద్యా సాగర్
రచన : వేటూరి

Wednesday, April 11, 2007

గొల్ల గోపన్న.. ఒకసారి కలలోకి రావయ్యా..


గొల్ల గోపన్న …. ఒకసారి కలలోకి రావయ్యా
ఒకసారి కలలోకి రావయ్యా

నా ఉవ్విళ్ళు కవ్వించి పోవయ్యా
ఓ గొల్ల గోపయ్యా …

ఒకసారి రాగానే ఏమౌనులే ..
నీ హృదయాన శయనించి ఉంటానులే ..
ఏలుకుంటానులే …
ఒకసారి రాగానే ఏమౌనులే

పగడాల నా మోవి చిగురించెరా ..
మోము చెమరించెరా .. మేను పులకించెరా
సొగసు వేణువు చేసి పలికించరా
సొగసు వేణువు చేసి పలికించరా

కెమ్మోవి పై తేనె ఒలికించనా …
కెమ్మోవి పై తేనె ఒలికించనా
తనివి కలిగించనా .. మనసు కరిగించనా
కేరింతలాడించి సోలించనా … కేరింతలాడించి సోలించనా
ఒకసారి కలలోకి రావయ్యా

ఒంపుసొంపుల మెరుపు మెరిపించవే
వగలు కురిపించవే … మేను మరపించవే
మరపులో మధుకీల రగిలించవే ..
మరపులో మధుకీల రగిలించవే
చిలిపి చూపుల సిగ్గు కలిగిందిరా ..
చిలిపి చూపుల సిగ్గు కలిగిందిరా
మొగ్గ తొడిగిందిరా .. మురిసి విరిసిందిరా
పదును తేలిన వలపు పండించరా
పదును తేలిన వలపు పండించరా

ఒకసారి కలలోకి రావయ్యా
నా ఉవ్విళ్ళు కవ్వించి పోవయ్యా
ఓ గొల్ల గోపయ్యా …

ఒకసారి రాగానే ఏమౌనులే ..
~*~

ఈ పాటను ఇక్కడ వినండి.
~*~
చిత్రం : గోపాలుడు భూపాలుడు
గాత్రం : ఘంటసాల, యస్.జానకి
సంగీతం : యస్.పి.కోదండపాణి
రచన : ఆరుద్ర