చూడుమదే చెలియా..
చూడుమదే చెలియా..కనుల
చూడుమదే చెలియా..కనుల
చూడుమదే చెలియా..
బృందావనిలో నందకిశోరుడు
బృందావనిలో నందకిశోరుడు
అందముగా దీపించే లీలా...
చూడుమదే చెలియా..కనుల
చూడుమదే చెలియా..
మురళీ కృష్ణుని మోహన గీతికి
మురళీ కృష్ణుని మోహన గీతికి
పరవశమైనవి లోకములే..
పరవశమైనవి లోకములే
విరబూసినవీ పొన్నలు పొగడలు
విరబూసినవీ పొన్నలు పొగడలు
పరిమళమెగసెను నలయా నిలముల పోలెను యమునా...
చూడుమదే చెలియా..కనుల
చూడుమదే చెలియా..
నారీ నారీ నడుమ మురారి
నారీ నారీ నడుమ మురారి
హరికీ హరికీ నడుమ వయ్యారీ
హరికీ హరికీ నడుమ వయ్యారీ
తానొకడైనా..........
తానొకడైనా తలకొక రూపై
తానొకడైనా తలకొక రూపై
మనసులు దోచే రాధా మాధవ కేళీ నటనా..
చూడుమదే చెలియా..
కనులచూడుమదే చెలియా..
~*~
~*~
చిత్రం : విప్రనారాయణ (1954)
గాత్రం : ఏ.యం.రాజా
సంగీతం: యస్.రాజేశ్వరరావ్
రచన : సముద్రాల
3 comments:
ఈ బృందావనం చాలా సుందరకమనీయముగా ఉంది! మీ కృషికి ప్రత్యేక అభినందనలు!!
బృందావనిలో నందకిశోరుడు
అందముగా "దీపించే" లీల...
నాకు చాలా ఇష్టమైనవాటిలో ఈ పాట ఒకటి. "దీపించే" అనే పదం సరైనదేనా లేక నాకు అది ఆలా తప్పుగా వినబడుతోందా అని సందేహం ఉండేది. Oldtelugusongs అనే యాహూబృందంలోని సభ్యులను అడిగాను, ఆ పదం సరైనదే అన్నారుగానీ, దాని అర్థమేమిటంటే సమాధానం రాలేదు. మీ బ్లాగులో ఈ పాటను చూశాక బ్రౌణ్యంలో వెదకాలనే ఆలోచన కలిగింగి. ధన్యవాదాలు. దీపించు అనే పదానికి అర్థం ఇలా ఉంది:
దీపించు. dīp-inṭsu. v. n. To shine, to be evident. to be distinguished or glorious
థాంక్యూ రానారె గారు! మీ నిశిత పరిశీలనా దృష్టికి నా జోహార్లు :)
and thank u for sharing the meaning too.
Post a Comment