Monday, August 27, 2007

పొన్న చెట్టు నీడలో కన్నయ్య పాడితే...

పొన్న చెట్టు నీడలో కన్నయ్య పాడితే
రాగాలే ఊగాయి నీలాల యమునలో
పొన్న చెట్టు నీడలో కన్నయ్య పాడితే
రాగాలే ఊగాయి నీలాల యమునలో
~
పొన్న చెట్టు నీడలో కన్నయ్య పాడితే
రాగాలే రేగాయి రాధమ్మ మదిలో
పొన్న చెట్టు నీడలో కన్నయ్య పాడితే
రాగాలే రేగాయి రాధమ్మ మదిలో...రాధమ్మ మదిలో
~
ఎర్రనైన సంధ్యలో నల్లనయ్య నవ్వితే
పొంగింది గగనాన భూపాళ రాగం
ఎర్రనైన సంధ్యలో నల్లనయ్య నవ్వితే
పొంగింది గగనాన భూపాళ రాగం
~
ఎర్రనైన సంధ్యలో నల్లనయ్య నవ్వితే
పలికింది పరువాల తొలి వలపు రాగం...తొలి వలపు రాగం
~
పొన్న చెట్టు నీడలో కన్నయ్య పాడితే
రాగాలే రేగాయి రాధమ్మ మదిలో
రాగాలే ఊగాయి నీలాల యమునలో
~

నీలమేఘశ్యాముని నీడ సోకినంతనే
చిన్నారి నెమలి చేసింది నాట్యం
నీలమేఘశ్యాముని నీడ సోకినంతనే
చిన్నారి నెమలి చేసింది నాట్యం
~
నీలమేఘశ్యాముని నీడ సోకినంతనే
మైమరచి రాధమ్మ మరచింది తాళం...మరచింది తాళం
~
పొన్న చెట్టు నీడలో కన్నయ్య పాడితే
రాగాలే ఊగాయి నీలాల యమునలో
పొన్న చెట్టు నీడలో కన్నయ్య పాడితే
రాగాలే రేగాయి రాధమ్మ మదిలో...రాధమ్మ మదిలో..
~*~
ఈ పాటను ఇక్కడ వినండి
~*~
చిత్రం : భలే కృష్ణుడు (1980)
గాత్రం : యస్.పి.బాలు, పి.సుశీల
సంగీతం: చక్రవర్తి

2 comments:

విహారి(KBL) said...

మీకు నా శ్రావణపూర్ణిమ(రాఖీ)శుభాకంక్షలు.

Anonymous said...

radhaa..picture and song ..rendu.baavunnaayi..:)