మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే...
~
సిగ్గు చాటున నా లేత వలపు మొగ్గ తొడిగిందీ
~
కెరటాల వెలుగు చెంగలువా నెలరాజు పొందు కోరేను
~
~
~
మాధవునికై వెలసిన ప్రేమ మందిరం - విరిసిన నా హృదయ నందనం
Posted by
హృదయ బృందావని
at
8/29/2007 11:52:00 PM
4
comments
Labels: ఆరుద్ర, పి.సుశీల, యస్.పి.కోదండపాణి
పొన్న చెట్టు నీడలో కన్నయ్య పాడితే
రాగాలే ఊగాయి నీలాల యమునలో
పొన్న చెట్టు నీడలో కన్నయ్య పాడితే
రాగాలే ఊగాయి నీలాల యమునలో
~
పొన్న చెట్టు నీడలో కన్నయ్య పాడితే
రాగాలే రేగాయి రాధమ్మ మదిలో
పొన్న చెట్టు నీడలో కన్నయ్య పాడితే
రాగాలే రేగాయి రాధమ్మ మదిలో...రాధమ్మ మదిలో
~
ఎర్రనైన సంధ్యలో నల్లనయ్య నవ్వితే
పొంగింది గగనాన భూపాళ రాగం
ఎర్రనైన సంధ్యలో నల్లనయ్య నవ్వితే
పొంగింది గగనాన భూపాళ రాగం
~
ఎర్రనైన సంధ్యలో నల్లనయ్య నవ్వితే
పలికింది పరువాల తొలి వలపు రాగం...తొలి వలపు రాగం
~
పొన్న చెట్టు నీడలో కన్నయ్య పాడితే
రాగాలే రేగాయి రాధమ్మ మదిలో
రాగాలే ఊగాయి నీలాల యమునలో
~
నీలమేఘశ్యాముని నీడ సోకినంతనే
చిన్నారి నెమలి చేసింది నాట్యం
నీలమేఘశ్యాముని నీడ సోకినంతనే
చిన్నారి నెమలి చేసింది నాట్యం
~
నీలమేఘశ్యాముని నీడ సోకినంతనే
మైమరచి రాధమ్మ మరచింది తాళం...మరచింది తాళం
~
పొన్న చెట్టు నీడలో కన్నయ్య పాడితే
రాగాలే ఊగాయి నీలాల యమునలో
పొన్న చెట్టు నీడలో కన్నయ్య పాడితే
రాగాలే రేగాయి రాధమ్మ మదిలో...రాధమ్మ మదిలో..
~*~
ఈ పాటను ఇక్కడ వినండి
~*~
చిత్రం : భలే కృష్ణుడు (1980)
గాత్రం : యస్.పి.బాలు, పి.సుశీల
సంగీతం: చక్రవర్తి
Posted by
హృదయ బృందావని
at
8/27/2007 04:04:00 PM
2
comments
Labels: చక్రవర్తి, పి.సుశీల, యస్.పి.బాలు
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
~
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
~
రామయ్య ఎదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై
~
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
~
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనిషిక్కడ మనసక్క్డ ఇన్నాళ్ళైనా
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనిషిక్కడ మనసక్క్డ ఇన్నాళ్ళైనా
~
నీ ఊసులనే నా ఆశలుగా
నా ఊహలనే నీ బాసలుగా
అనుగొంటిని కలగంటిని నే వెర్రిగా
నే కన్న కలలు నీ కళ్ళతోనే
నాకున్న తావు నీ గుండెలోనె
కాదన్ననాడు నేనే లేను
~
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
రామయ్య ఎదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
~
నా వయసొక వాగైనదినా వలపొక వరదైనది
నా మనసొక నావైనది ఆ వెల్లువలో
నా వయసొక వాగైనదినా వలపొక వరదైనది
నా మనసొక నావైనది ఆ వెల్లువలో
ఈ వెల్లువలో ఎమవుతానో
ఈ వేగంలో ఎటుపోతానో
ఈ నావకు నీ చేరువ తావున్నదో
తెరచాప నువ్వై నడిపించుతావో
దరిచేర్చి నన్ను వడిచేర్చుతావో
నట్టేట నన్ను ముంచేస్తావో
~
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
రామయ్య ఎదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై
~
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
వేచాను నీ రాకకై..
~*~
ఈ పాటను ఇక్కడ వినండి.
~*~
చిత్రం : మంచి మనసులు (1986)
గాత్రం : జానకి
సంగీతం: ఇళయరాజా
రచన : ఆత్రేయ
*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*
Posted by
హృదయ బృందావని
at
8/14/2007 08:01:00 PM
4
comments
Labels: ఆత్రేయ, ఇళయరాజా, యస్.జానకి, యస్.పి.బాలు