Thursday, April 5, 2007

అలా మండి పడకే జాబిలీ..


అలా మండి పడకే జాబిలీ..
చలీ ఎండ కాసే రాతిరీ
దాహమైన వెన్నెల రేయి
దాయలేను ఇంతటి హాయి
ఎలా తెలుపుకోనూ ప్రేమనీ
ఎలా పిలుచుకోనూ రమ్మనీ
~
అలా మండి పడకే జాబిలీ చలీ ఎండ కాసే రాతిరీ
~
నిన్ను చూడకున్నా నీవు చూడకున్నా
నిదురపోదు కన్నూ నిశీ రాతిరీ
నీవు తోడు లేక నిలువలేని నాకు
కొడిగట్టు నేల కొన ఊపిరీ
ఇదేనేమో బహుశా తొలినాటి ప్రేమా
ఎలా పాడుకోనూ నిట్టూర్పు జోల
ఈ పూల బాణాలు ఏ పూల గంధాలు
సోకేను నా గుండెలో
సెగ లేని సయ్యాటలో
~
అలా మండి పడకే జాబిలీ చలీ ఎండ కాసే రాతిరీ
~
దాహమైన వెన్నెల రేయి
దాయలేను ఇంతటి హాయి
ఎలా తెలుపుకోనూ ప్రేమనీ
ఎలా పిలుచుకోనూ రమ్మనీ
~
పూటకొక్క తాపం పూల మీద కోపం
పులకరింతలాయే సందె గాలికీ
తీపి కాలం చెలిమి లోని అందం
తెలుసుకుంది నేడే జన్మ జన్మకీ
సంఘాన వున్నా రాయభారమాయే
చాటు మాటునేవో రాసలీలలాయే
ఈ పూల గంధాలు ఈ తేనె గుండాలు
గడిచేది ఎన్నాళ్ళకో కలిసేది ఏనాటికో
~
అలా మండి పడకే జాబిలీ
చలీ ఎండ కాసే రాతిరీ
దాహమైన వెన్నెల రేయి
దాయలేను ఇంతటి హాయి
ఎలా తెలుపుకోనూ ప్రేమనీ
ఎలా పిలుచుకోనూ రమ్మనీ

powered by ODEO

~*~

చిత్రం : జాకీ(1980's)

2 comments:

రాధిక said...

ఎప్పుడూ విననేలేదు ఈపాట

హృదయ బృందావని said...

ఇది చాలా పాప్యులర్ సాంగే రాధిక గారూ!
లింక్ ఇస్తున్నాను వినండి.
http://www.chimatamusic.com/playcmd.php?plist=280
ఎవరు పాడారో తెలీదు కాని చాలా అద్బుతంగా పాడారు.
ముఖ్యంగా పాటలోని లిరిక్స్ బాగా నచ్చాయి నాకు.