Sunday, December 16, 2007

మధువనిలో రాధికవో..



మధువనిలో రాధికవో..మధువొలికే గీతికవో
మధురం ఈ జీవనం .. మధురం ఈ జవ్వనం
మనోహరం .. మనోహరం !

మధువనిలో రాధికనూ..మది పలికే గీతికనూ
మధురం ఈ జీవనం .. మధురం ఈ జవ్వనం
మనోహరం .. మనోహరం !

మధువనిలో రాధికవో..మధువొలికే గీతికవో

కార్తీకాన కళలే చిలికి వెలిగే జాబిలీ..
ఎదలో మల్లెల పొదలో వెలిగెను నేడీ జాబిలీ..
నీలాకాశ వీధుల్లోన వెలిగే సూర్యుడూ..
వెతలే మాసిన కధలో వెలిగెను నేడీ సూర్యుడూ..

తొలి తొలీ వలపులే..
తొలకరీ మెరుపులై..
విరిసే వేళలో..హేలలో..డోలలో..

మధువనిలో రాధికనూ..మది పలికే గీతికనూ
మధురం ఈ జీవనం .. మధురం ఈ జవ్వనం
మనోహరం .. మనోహరం !

మధువనిలో రాధికనూ..మది పలికే గీతికనూ..

బృందావనికి మురళీధరుడు ఒకడే కృష్ణుడూ..
ఎదిగిన బాలిక ఎద గల గోపికకతడే దేవుడూ..
మధురాపురికి యమునా నదికి ఒకటే రాధికా..
మరువైపోయిన మనసున వెలసెను నేడీ దేవతా..

వెలుగులా వీణలే..పలికెనూ జాణలో..
అదియే రాగమో..భావమో..బంధమో..

మధువనిలో రాధికవో..మధువొలికే గీతికవో
మధురం ఈ జీవనం .. మధురం ఈ జవ్వనం
మనోహరం .. మనోహరం !
~*~

ఈ పాటను ఇక్కడ వినండి.
~*~
చిత్రం : అల్లరిబావ
సంగీతం: రాజన్-నాగేంద్ర
గాత్రం : యస్.పి.బాలు, పి.సుశీల
రచన : వేటూరి

5 comments:

విహారి(KBL) said...

చాలా రోజుల తర్వాత మంచి పాత తో వచ్చారు.

విహారి(KBL) said...

నేను బాగున్నానండి.ఉషాకిరణ్ మూవీస్ వారి "వీధి" సినిమాలో కృష్ణుని పాట ఒకటి వుంది.వినండి.ఇంతకు ముందే పోస్ట్ చేసుంటే ok.

విహారి(KBL) said...

Happy new year to you brundavani garu.Mohanbabu Tappu chesi pappu kudu movie lo kuda oka song "Brundavanamali" ani vuntundi.chudandi.

Anonymous said...

బ్రుందా,

చాలా బవుంది.

ఈ పిక్చెర్ కొథా కాదు
బట్
ఈ పాటా అంద్ ఫిక్చెర్ చొంబినతిఒన్ నాకు
బాగా నచింది

GARAM CHAI said...

We started our new youtube channel : Garam chai . Please watch and subscribe our channel and encourage us too

https://www.youtube.com/garamchai