Sunday, September 2, 2007

శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు

వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళీ
నవరస మురళీ..ఆనందన మురళీ
ఇదేనా ఇదేనా ఆ మురళి..మొహనమురళీ
ఇదేనా ఆ మురళీ
~
వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళీ
నవరస మురళీ..ఆనందన మురళీ
ఇదేనా ఇదేనా ఆ మురళి..మొహనమురళీ
ఇదేనా ఆ మురళీ
~
కాళింది మడుగునా కాళియుని పడగలా
ఆబాల గోపాల మాబాల గోపాలుని
కాళింది మడుగునా కాళియుని పడగలా
ఆబాల గోపాల మాబాల గోపాలుని
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ
తాండవమాడిన సరళి గుండెల మ్రోగిన మురళి
ఇదేనా..ఇదేనా ఆ మురళీ
~
అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరలా వినిపించీ మరులే కురిపించి
అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరలా వినిపించీ మరులే కురిపించి
జీవన రాగమై బృందావన గీతమై
ఆ.. జీవన రాగమై బృందావన గీతమై
కన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి
ఇదేనా.. ఇదేనా ఆ మురళీ
~
వేణుగానలోలుని మురిపించిన రవళి..
నటనల సరళి ఆ నందనమురళీ
ఇదేనా ఆ మురలి మువ్వల మురళీ
ఇదేనా ఆ మురళీ
~
మధురానగరిలో యమునా లహరిలో
ఆ రాధ ఆరాధనా గీతి పలికించి
మధురానగరిలో యమునా లహరిలో
ఆ రాధ ఆరాధనా గీతి పలికించి
సంగీత నాట్యాల సంగమ సుఖ వేణువై
ఆ..ఆ..ఆసంగీత నాట్యాల సంగమ సుఖ వేణువై
రాసలీలకే ఊపిరిపోసిన అందెల రవళి
ఇదేనా..ఇదేనా ఆ మురళీ
~
వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళీ
నవరస మురళీ..ఆనందన మురళీ
ఇదేనా ఇదేనా ఆ మురళి..మొహనమురళీ
ఇదేనా ఆ మురళీ
చిత్రం : సప్తపది (1981)
సంగీతం: కె.వి.మహదేవన్
రచన : వేటూరి
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~


హే కృష్ణా....! హే కృష్ణ....! కృష్ణా...!
హే కృష్ణా...మళ్ళీ నీవే జన్మిస్తేనీ భగవద్గీతే నిజమయితే
హే కృష్ణా...మళ్ళీ నీవే జన్మిస్తేనీ భగవద్గీతే నిజమయితే
ప్రతి సుమవనము బృందావనము

ప్రతి సుమవనము బృందావనము

ప్రతి మూగ మోవీ మోహన మురళీ

కృష్ణా..!మళ్ళీ నీవే జన్మిస్తే

నీ భగవద్గీతే నిజమయితే

నీవు నేనూ వేరు కాదు

ఇద్దరి ఊరు వేరు కాదు

నీవు నేనూ వేరు కాదు

ఇద్దరి ఊరు వేరు కాదు

ఆడేది పాడేది నేను కాదు

నా ఆటలో పాటలో నీ దయ లేకపోలేదు

ఆడేది పాడేది నేను కాదు

నా ఆటలో పాటలో నీ దయ లేకపోలేదు

అందరి చూపు నా పైన

మరి నా చూపేమో నీ పైన

హే కృష్ణా...మళ్ళీ నీవే జన్మిస్తే

నీ భగవద్గీతే నిజమయితే

గోవులు కాస్తూ నీవుంటావు

నీజీవిక సాగిస్తు వుంటావు

గోవులు కాస్తూ నీవుంటావు

నీ జీవిక సాగిస్తు వుంటావు

పలికించు నీ వేణు గీతానికి

ఫలితము ఎన్నడు కోరుకోవులే నీవు

పలికించు నీ వేణు గీతానికి

ఫలితము ఎన్నడు కోరుకోవులే నీవు

నీ కథలోన నేనున్నాను

నీ కథలోన నేనున్నాను

నా కథలోన నీవున్నావు

కృష్ణా..!మళ్ళీ నీవే జన్మిస్తే

నీ భగవద్గీతే నిజమయితే


~*~
ఈ పాటను ఇక్కడ వినండి.
~*~
చిత్రం : మొరటోడు (1977)
సంగీతం: యం.యస్.విశ్వనాథన్

8 comments:

విహారి(KBL) said...

మీకు శ్రీక్రిష్ణాష్టమి శుభాకాంక్షలు

విశ్వనాధ్ said...

bomma baavumdi.meekkoodaa subhaakaamxalu.

కందర్ప కృష్ణ మోహన్ - said...

ఎంతో ఓపిగ్గా రచనలన్నీ ఎక్కిస్తున్నారు.. చిత్రాలతో సహా..వినే లింకులతో బాటుగా...పైగా ఇవన్నీ దాదాపు మరిచిపోబోతున్న పాటలు కూడానూ..

మీకు నా మనఃపూర్వక అభివందనాలు - అభినందనలు

హృదయ బృందావని said...

thank u Vihaari garu, Vishwanath garu and Krishnamohan garu. :)

Unknown said...

picture baa chesaavu radhaa :)

విహారి(KBL) said...

మీకు వినాయకచవితి శుభాకాంక్షలు

విహారి(KBL) said...

హృదయబృందావని గారు చాలా థాంక్సండి.
ఈ బ్లాగు మొదలు పెట్టి 5 రోజులు అయ్యింది.
మొన్న శనివారం ఈనాడు ఈతరం లో వచ్చింది చూడలేదా.

విహారి(KBL) said...

హృదయబృందావని గారు
aa song "Naalo vunna prema"
movie lonidi.jagapathibabu,laya,gajala
actors.