Friday, November 16, 2007

పిల్లనగ్రోవి పిలుపు...



పిల్లనగ్రోవి పిలుపు మెలమెల్లన రేపెను వలపు
మమతను దాచిన మనసు ఒక మాధవునికే తెలుసు
ఈ మాధవునికే తెలుసు!

సుందరి అందెల పిలుపు
నా డెందము నందొక మెరుపు
నంద కిశోరుని మనసు రతనాల బొమ్మకు తెలుసు!
ఈ రతనాల బొమ్మకు తెలుసు!

వెన్న మీగడలు తిన్నావట
వెన్నెలలో ఆడుకున్నావటా
వెన్న మీగడలు తిన్నావట
వెన్నెలలో ఆడుకున్నావటా
ఎన్నో నేర్చిన వన్నె కాడవట
ఏమందువో మరి నా మాట
ఏమందువో మరి నా మాట!

వెన్న మీగడలు తిన్నది నిజము
ఎన్నో నేర్చితినన్నదీ నిజము
వెన్న మీగడలు తిన్నది నిజము
ఎన్నో నేర్చితినన్నదీ నిజము
చిన్నారీ......చిన్నారీ!
నీ కన్నుల బాసలు వెన్నుని దోచిన
ఆ మాట నిజము..వెన్నుని దోచిన మాట నిజము!

సుందరి అందెల పిలుపు
నా డెందము నందొక మెరుపు
పిల్లనగ్రోవి పిలుపు మెలమెల్లన రేపెను వలపు!

అందీ అందని అందగాడవని
ఎందరో అనగా విన్నాను
అందీ అందని అందగాడవని
ఎందరో అనగా విన్నాను
అందులోని పరమార్ధమేమిటో
అలవోకగా కనుగొన్నాను..అలవోకగా కనుగొన్నాను!

ఎంత బేలవని అనుకున్నాను
అంత గడసరి తరుణివిలే
ఎంత బేలవని అనుకున్నాను
అంత గడసరి తరుణివిలే
అష్ట భార్యలతో అలరే రాజును
చెంగును ముడిచిన చెలువవులే
చెలువవులే చెంగలువవులే !

పిల్లనగ్రోవి పిలుపు మెలమెల్లన రేపెను వలపు
మమతను దాచిన మనసు ఒక మాధవునికే తెలుసు
ఈ మాధవునికే తెలుసు!
~*~

~*~
చిత్రం : శ్రీకృష్ణ విజయం(1971)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
రచన : సి.నారాయణ రెడ్డి

Monday, November 12, 2007

చందమామ రావే జాబిల్లి రావే...



చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే
చందమామ రావే జాబిల్లి రావే

చలువ చందనములుపూయ చందమామ రావే
జాజిపూల తావినియ్య జాబిల్లి రావే
చలువ చందనములుపూయ చందమామ రావే
జాజిపూల తావినియ్య జాబిల్లి రావే
కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే
కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే
గగనపు విరితోటలోని గోగుపూలు తేవే
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే
చందమామ రావే జాబిల్లి రావే

మునిజన మానస మోహిని యోగిని బృందావనం
మురళీరవళికి ఆడిన నాగిని బృందావనం
మునిజన మానసమోహిని యోగిని బృందావనం
మురళీరవళికి ఆడిన నాగిని బృందావనం
రాధామాధవ గాథల రంజిలు బృందావనం
గోపాలుని మృదుపద మంజీరము బృందావనం
గోపాలుని మృదుపద మంజీరము బృందావనం

బృందావనం బృందావనం

హే కృష్ణా ముకుందా మురారీ
హే కృష్ణా ముకుందామురారీ కృష్ణా ముకుందా మురారీ
కృష్ణా ముకుందా మురారీ
జయ కృష్ణా ముకుందా మురారీ
జయ జయ కృష్ణా ముకుందా మురారీ

చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే
చందమామ రావే జాబిల్లి రావే
~*~
~*~

చిత్రం : సిరివెన్నెల
సంగీతం: కె.వి.మహదేవన్
గాత్రం : యస్.పి.బాలు, పి.సుశీల, బి.వసంత
రచన : సీతారామ శాస్త్రి(సిరివెన్నెల)

Thursday, November 8, 2007

దీపావళి శుభాకాంక్షలు !




అనురాగ సరళి

ఆనంద రవళి

ప్రతి ఇంటా జరగాలి

ప్రభవించే దీపావళి!

వంశీ కృష్ణా! యదు వంశీ కృష్ణా!

*
వంశీ కృష్ణా! యదు వంశీ కృష్ణా!
వంశీ కృష్ణా! యదు వంశీ కృష్ణా!
గోప వనిత! హృదయ సరసి! రాజ హంసా!
కృష్ణా..కృష్ణా!
గోప వనిత! హృదయ సరసి! రాజ హంసా!
కృష్ణా..కృష్ణా!
వంశీ కృష్ణా! యదు వంశీ కృష్ణా!

పుట్టింది రాజకుమారుడుగా
పెరిగింది గోపకిశోరుడుగా
తిరిగింది యమునా తీరమున
నిలిచింది గీతాసారంలో
గోప వనిత! హృదయ సరసి! రాజ హంసా!
కృష్ణా..కృష్ణా!
వంశీ కృష్ణా! యదు వంశీ కృష్ణా!

ప్రాణులందరూ వేణువులే
అవి పలికేది నీ రాగములే
పాడేది పాడించేది ఆడేది ఆడించేది
ఓడేది ఓడించేది
అంతా నువ్వేలే అన్నీ నీ లీలలే
గోప వనిత! హృదయ సరసి! రాజ హంసా!
కృష్ణా..కృష్ణా!
వంశీ కృష్ణా! యదు వంశీ కృష్ణా!

నోటిలో ధరణి చూపిన కృష్ణా!
గోటితో గిరిని మోసిన కృష్ణా!
ఆటగా రణము నడిపిన కృష్ణా!
ఆటగా రణము నడిపిన కృష్ణా!
ఆటగా బ్రతుకు గడిపిన కృష్ణా!
ఆటగా బ్రతుకు గడిపిన కృష్ణా!
కిల కిల మువ్వల కేళీ కృష్ణా!
తకదిమి తకదిమి తాండవ కృష్ణా!
కేళీ కృష్ణా! తాండవ కృష్ణా!
కేళీ కృష్ణా! తాండవ కృష్ణా!
కేళీ కృష్ణా! తాండవ కృష్ణా!

~*~
ఈ పాటను ఇక్కడ వినండి.
~*~
చిత్రం : వంశ వృక్షం(1980)
సంగీతం: కె.వి.మహదేవన్
రచన : సి.నారాయణ రెడ్డి